Mlla Reddy: మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్థల వివాదంపై విచారణ కొనసాగుతోంది. సుచిత్రలోని 82, 83 సర్వే నంబర్లలోని స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు సంబంధిత పత్రాలను పరిశీలించారు. భూ సర్వే కూడా చేస్తున్నారు. కాగా, ఎలాంటి వివాదం తలెత్తకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా అక్కడ పోలీసులను మోహరించారు. పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాంగ్మూలం నమోదు చేశారు. అయితే నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయడాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రెవెన్యూ అధికారులను తప్పుబట్టారు. 13 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేసి ఆస్తిపన్ను చెల్లిస్తున్నామని చెప్పారు. 2011లో తాను, మల్లారెడ్డి ఈ భూమిని కొనుగోలు చేశానని.. ఆ సమయంలో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. చట్టపరంగా రావాలని కొందరు వివాదం సృష్టిస్తున్నారని వాపోయారు.
Read also: Yadadri Dress Code: యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమి కోర్టు వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ స్థలంలో వేసిన బారికేడ్లను నిన్న తొలగించారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో ఉన్న రెండున్నర ఎకరాల భూమి తమదేనని మల్లారెడ్డి పేర్కొనగా, మిగిలిన 15 మంది 1.11 ఎకరాలు తమదని, ఒక్కొక్కరు 400 గజాలు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందన్నారు.
Read also: KTR: మల్టీ లెవల్ కార్ పార్కింగ్ దృష్టి పెట్టండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ ట్విట్..
ఈ క్రమంలో ఇరువర్గాలకు పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే మల్లారెడ్డి పోలీసుల మాట వినకుండా.. ఆయన అనుచరులను ఫెన్సింగ్ నుంచి తప్పించాలని అన్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా అంటూ మల్లారెడ్డి పోలీసులతో చెప్పడంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82 భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్లారెడ్డి అరెస్ట్ తో బీఆర్ఎన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Warangal MGM Hospital: దారుణం.. ఫోనులో డాక్టర్.. ఆపరేషన్ చేసిన నర్సులు.. పాప మృతి
