Site icon NTV Telugu

Minister KTR WhatsApp: నిలిచిన కేటీఆర్ వాట్సాప్.. కారణమిదే!

Ktr Whatsapp Not Working

Ktr Whatsapp Not Working

Minister KTR WhatsApp Stopped Working: నిన్నటి నుంచి తన వాట్సాప్ పని చేయడం లేదని మంత్రి కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా వెల్లడించారు. తనకు ఎనిమిది వేలకు పైగా మెసేజ్‌లు వచ్చాయని, వాటికి రిప్లై ఇస్తున్న తరుణంలో మూడుసార్లు తన ఎకౌంట్ లాగౌట్ అయ్యిందని పేర్కొన్నారు. కానీ.. ఇప్పుడు వాట్సాప్ 24 గంటల నుంచి పూర్తిగా అందుబాటులో లేకుండా పోయిందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని సైతం ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. అందులో ‘స్పామ్ కారణంగా వాట్సాప్ వినియోగించేందుకు ఈ ఖాతాకి అనుమతి లేదు’ అనే సందేశాన్ని మనం గమనించవచ్చు. అలాగే.. రివ్యూ కోసం రిక్వెస్ట్ చేయమని లేదా కొత్త నంబర్ నుంచి రిజిస్టర్ చేసుకోండి అనే సూచనని కూడా ఆ స్క్రీన్‌షాట్‌పై గమనించవచ్చు.

కాగా.. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనప్పుడు అనుకోకుండా కాలు జారి కేటీఆర్ కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన యాంకిల్‌కి గాయమైంది. ఇందుకు శస్త్రచికిత్స చేయించుకున్న కేటీఆర్.. వైద్యుల సూచన మేరకు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంట్లో నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

Exit mobile version