NTV Telugu Site icon

Minster KTR: దుబ్బాకలో కేటీఆర్‌ పర్యటన.. ముస్తాబాద్‌ లో రోడ్‌షోలో..

Ktr

Ktr

Minster KTR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిద్దిపేటలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దుబ్బాక నుంచి రోడ్డు మార్గంలో ముస్తాబాద్ చేరుకుంటారు. అనంతరం మండల కేంద్రంలో రోడ్‌షోలో పాల్గొంటారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండలో నిర్వహించిన రోడ్​ షోలో నిన్న కేటీఆర్ మాట్లాడారు.. పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీని ‘ప్రధాని మంత్రి’ అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ నేతలంతా నిరుద్యోగులని, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఏమీ తెలియదని, క్లబ్బులు, పబ్బులు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. కేవలం 3 గంటల కరెంటు సరిపోతుందని రేవంత్ చెబితే.. రైతుబంధు వేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. ఈ కాంగ్రెస్ నేతలు తీగ పట్టుకుంటే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుందని, రాష్ట్రంలో పేదరికం కూడా పోతుందన్నారు. 11 అవకాశాలు వచ్చినా ఏమీ చేయని ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఈ ఒక్క ఛాన్స్ మాత్రమే అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కావాలా కరెంటు కావాలా ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఎన్నికల తర్వాత అమలు చేయనున్న పథకాలను కేటీఆర్ వివరించారు.
Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. ఈరోజు ఎంతంటే?

Show comments