NTV Telugu Site icon

KTR Tweets: ఇంకా ఎంతమంది మిగిలారు..?

Ktr Tweet

Ktr Tweet

KTR Tweets: బీహార్ రాష్ట్రంలో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీతో జట్టు కట్టబోతున్నారు. బుధవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు 8వసారి నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గవర్నర్ ను కలిసిన నితీష్ కుమార్.. తనకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఎమ్మెల్యే మద్దతు ఉందని.. అందుకు సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ ఫాగు చౌహాన్ కు అందించిన విషయం తెలిసిందే.

అయితే దీనిపై పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ బీజేపీ పై ట్విటర్‌ వేదికగా చురుకలంటించారు. ఎన్డీఏ నుంచి జేడీయూ నిష్క్రమించిన తర్వాత ఎంతమంది కూటమి భాగస్వాములు మిగిలారు, సీబీఐ ఐటీ, ఈడీ కాకుండా ఇంకా ఎంతమంది అంటూ ట్విటర్​లో ఎద్దేవా చేశారు.

‘ఎకనామిక్ టైమ్స్’ ద్వారా తెలంగాణ ఉత్తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EODB)/అమలుచేసే రాష్ట్రంగా గుర్తింపు పొందిందని కేటీఆర్ ట్విట్ చేసారు.

అయితే.. కామన్వెల్త్‌ 2022 పోటీల్లో రాష్ట్రాల వారీగా పతకాలు సాధించిన పట్టికలో తెలంగాణ 2వ స్థానంలో నిలిచిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఎంతో.. అద్భుతంగా రాణించి పతకాల పట్టికలో రాష్ట్రాన్ని 2వ స్థానంలో నిలిపిన విజేతలకు వారి కోచ్‌లు, సపోర్టు సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈక్రీడలు ఇటీవల ముగిసిన కామన్వెల్త్​ క్రీడల్లో భారత్​ నాలుగో స్థానంతో ముగించిందని, మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 స్వర్ణపతకాలు సహా 16 రజతం, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.

Show comments