IT Minister KTR: హైదరాబాద్‌లో బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. మౌళిక వసతుల విషయంలో హైదరాబాద్ నగరం వెనుకబడి లేదని కేటీఆర్ అన్నారు. నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో గత ఏడాదిన్నర కాలంలో లక్షన్నర ఉద్యోగాలు కల్పించామని మంత్రి తెలిపారు. అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయని మంత్రి తెలిపారు.
Read also: AP High Court: ఇప్పటం గ్రామస్తులకు మరోసారి హైకోర్టులో చుక్కెదురు
భారతదేశంలోని మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని చెప్పారు. బోష్ అతిపెద్ద కంపెనీ, సాఫ్ట్‌వేర్ కొత్త యుగం మొబైల్‌లు, కార్లలో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఆటోమోటివ్ రంగంలో బోష్ మరింత రాణిస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మొబిలిటీ వ్యాలీని రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్వాల్‌కామ్ లాంటి సెమీకండక్టర్ కంపెనీలు హైదరాబాద్‌లో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఫార్ములా-ఇ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తొలి నగరం హైదరాబాద్ అని ఆయన పేర్కొన్నారు. ఈవీవీ సమ్మిట్‌ను ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Jagga Reddy: తాను పాలు పోసి పెంచిన పాము.. తననే కాటేస్తుందనే విషయం తెలియదా?