Minister KTR speech on Telangana development: తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామన్నారు. నగరం లో ట్రాఫిక్ సమస్య వచ్చే రోజుల్లో తగ్గిస్తామన్నారు. మీరు ఇచ్చిన సమస్యలన్నీ డిసెంబర్ 3 తర్వత పరిష్కరిస్తామన్నారు. డిసెంబర్ 3న మళ్ళీ మేమే అధికారం లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ల ప్రతినిధుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో తెలంగాణ ఏర్పాటు ముందు యెన్నో అనుమానాలు ఉండేవని అన్నారు. కానీ ఈ తొమిదిన్నర ఏళ్లలో అంచెలంచెలుగా చేసి చూపించామన్నారు. కరోనా రెండేళ్లు మినహా మిగితా ఆరున్నర యేళ్లు మేము పని చేసి, అభివృద్ది చూపించామని తెలిపారు. మెట్రో ను మరింత విస్తరిస్తామని, ట్రాఫిక్ తగ్గాలంటే మెట్రో సేవలు పెరగాలన్నారు.
జీహెచ్ఎంసీ ఒక కమిషనర్ సరిపోరని, వచ్చే ప్రభుత్వంలో జీహెచ్ఎంసీకి మరో ఇద్దరు స్పెషల్ కమిషనర్ లను నియమిస్తామన్నారు. అందులో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు, మరొకరు చెరువుల పరిరక్షణ చూసే విధంగా నియామకం చేస్తామన్నారు. వచ్చే అయిదేళ్లలో హైదరాబాద్ కు 24 గంటల మంచినీళ్లు తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని నటుడు రజనీకాంత్ కొనియాడారని మంత్రి గుర్తు చేశారు. అభివృద్ధిలో న్యూయార్క్ తో హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు. గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లై ఓవర్లు నిర్మించామని, 39 చెరువులను పునరుద్ధరించామని మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ కార్యక్రమం వల్ల హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య తీరిందన్నారు. అదేవిధంగా దేశంలోనే నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గుర్తు చేశారు.
Rohit Sharma: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!