Site icon NTV Telugu

Minister KTR : 16 లక్షలు ఉద్యోగాలు రూప కల్పన చేశాం

Ktr

Ktr

నేడు మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో విప్రో కన్య్సూమర్‌ కేర్‌ ఫ్యాక్టరీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థ విప్రో అని ఆయన అన్నారు. విప్రో చైర్మన్‌ అజీమ్ ప్రేమ్ జీ లాంటి వ్యక్తి మన మధ్య ఉండడం అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి ఆయన అని, 300 కోట్ల పెట్టుబడులు తో ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారన్నారు. 90 శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం అభినందనీయమన్నారు.

టీఎస్ఐ పాస్ ద్వారా గత ఏడేళ్లుగా 2,20,000 కోట్లు పెట్టుబడిలు వచ్చాయన్నారు. 16 లక్షలు ఉద్యోగాలు రూప కల్పన చేశామని, ఒక ఫ్యాక్టరీని తీసుకు రావాలంటే చాలా కష్టం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడి ఫ్యాక్టరీలని ఇక్కడికి వచ్చేలా ప్రయత్నము చేస్తామని ఆయన తెలిపారు. సమస్యలను పరిష్కారం చేసుకుని రాష్ట్ర అభివృద్ధిలో పాటు పడాలని ఆయన అన్నారు.

https://ntvtelugu.com/sabitha-indra-reddy-at-wipro-manifacture-unit-launch/

Exit mobile version