NTV Telugu Site icon

Minister KTR: బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్‌.. మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి

It Minister Ktr

It Minister Ktr

Minister KTR: మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామానికి చేరుకున్న మంత్రి కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. దూమాల గ్రామంలో ఘనంగా జరుగుతన్న బీరప్ప ఉత్సవాలకు మంత్రి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజన్నపేట గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతి కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కిస్టు నాయక్‌ తండాలో మంత్రి కేటీఆర్ కొద్దిసేపు ఆగారు. మంత్రి కేటీఆర్‌ తో మాట్లేడేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో కేటీఆర్ వారి వద్దకు వెళ్లి మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు.

Read also: Solar ecilipse effect: ఈ రాశుల వారికి పట్టిందే బంగారం.. అందులో మీరు ఉన్నారా?

అక్కడ నుంచి దేవునిగుట్ట తండాలో గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తండా (తిమ్మాపూర్)గ్రామపంచాయతీ భవనం మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రాచర్ల తిమ్మాపూర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. కేటీఆర్ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ రాకతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
Jagga Reddy: జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు.. రేవంత్ కు దక్కని ఆహ్వానం

Show comments