Site icon NTV Telugu

Minister KTR: నేడు చలో జల విహార్‌ సభ.. హాజరు కానున్న మంత్రి కేటీఆర్‌

Ktr

Ktr

Minister KTR: నాంపల్లి కోర్టు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభకు మంత్రి కేటీఆర్‌ హాజరవుతారని, బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా ‘చలో జలవిహార్‌’ పేరిట నిర్వహించే సభలో న్యాయవాదులు పెద్దఎత్తున పాల్గొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాంపల్లి కోర్టులో న్యాయవాదులకు బీఆర్‌ఎస్ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ కూడా హాజరుకానున్నారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా విజయం సాధించేందుకు సహకరించాలని కోరారు. న్యాయవాదుల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని హైదరాబాద్ జలవిహార్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమావేశానికి న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని న్యాయవాదులు పిలుపునిచ్చారు.

ఈ ఆత్మీయ సమావేశం ద్వారా సీనియర్ న్యాయవాదులు, న్యాయ సోదర సోదరీమణులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా గడపనున్నారు. న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులకు న్యాయవాదులందరూ సహకరించాలని మంత్రి కోరనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మోదీ తెలంగాణకు వచ్చి కాంగ్రెస్‌ను బీఆర్‌ఎస్‌-బీటీఎం పిలుస్తారని కేటీఆర్‌ అన్నారు. రాహుల్ గాంధీ వచ్చి బీజేపీ బీటీఎంపై నిరాధార ఆరోపణలు చేస్తారు. నిజానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణ ప్రజల ఏ-టీమ్. తెలంగాణ ప్రజలు ఢిల్లీ నేతలకు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారని, ఇక వారిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈసారి తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఓ ఇటర్వ్యూలో కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Israel Hamas War: గాజాలో మరో ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి..15 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు

Exit mobile version