Jagadish Reddy Visit to Chautuppal: యాదాద్రి భవనగిరి జిల్లా చౌటుప్పల్ లో మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటించారు. ఈపర్యటలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకింది. చౌటుప్పల్ సహకారం సంఘం కార్యాలయం వద్ద నిర్మించనున్న గోదాముకు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈనేపథ్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేంద్రం తీరును ఎండగట్టారు. దీంతో కార్యక్రమంలో ఉన్న పలువురు పీఏసీఎస్ డైరెక్టర్లు జగదీశ్ రెడ్డితో వారించారు. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడకూడదు అంటూ ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్రిక్తత నేపథ్యంలో ఇద్దరు డైరెక్టర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే.. మంత్రి జగదీశ్‌రెడ్డి మైక్‌తీసుకుని బీజేపీ డైరెక్టర్‌లపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి మాట్లాడితే.. తప్పేంటి? అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మోడీ నిలువనా మోసం చేశారని ఎద్దేవా చేశారు. కాగా.. ఇక్కడ సహకార సంఘానికి శుభాకాంక్షలు చెప్పి వెళ్దామనుకుంటే బీజేపీకి సంబంధించిన వాళ్లు ఇలా సభలో అడ్డుకోవడం మంచి పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు దమ్ముంటే రండి చూసుకుందామని మంత్రి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈచర్చ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Venkateswara Swamy Stothra Parayanam Live: శనివారం వేంకటేశ్వర స్తోత్ర పారాయణం చేస్తే..
