మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి కోరిక మేరకు మార్చి తర్వత మేడ్చల్ మండలంలో రూ. 10 కోట్లతో మరో 50 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి అనుబంధంగా మరో కోటి రూపాయలతో ఎస్ఎన్సీయూ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రారంభించిన కేసీఅర్ కిట్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం నుండి 52 శాతానికి పెరిగాయని ఆయన అన్నారు. దీన్ని మరింత పెంచడంలో లక్ష్యంగా రాష్ట్రంలో అవసరం ఉన్న ప్రాంతాల్లో ఎంసీహెచ్, ఎస్ఎన్సీయూ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ కేంద్రంలో ఉండి పేదలపై మరింత భారం మోపే నిర్ణయాలను తీసుకుంటుందన్నారు.