Minister Errabelli: బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకం ఫోర్జరీ వ్యవహారం తెలంగాణలో కలకలం రేపింది. అలాగే మంత్రి లెటర్ హెడ్ తో పాటు సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి ఎర్రబెల్లి సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఓఎస్‌డీ మంత్రి ఎస్‌ఎం రాజేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. మంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ కావడం సంచలనంగా మారింది. డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఎలాగైనా ఇప్పించాలని భావించిన ఇద్దరు వ్యక్తులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతకాన్ని ఫోర్జరీ చేశారు.
Read also: Telangana Rain: తెలంగాణలో తగ్గిన వర్షాలు.. కొన్ని జిల్లాల్లో చెదురుమెుదురు పడే ఛాన్స్
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం నర్రెగూడెంకు చెందిన మహ్మద్ గౌస్ పాషా మొబైల్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఇక అదే జిల్లాకు చెందిన గుంటి శేఖర్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. డబుల్ బెడ్ రూం ఇండ్లు పొందాలని, ఇతర సామాజిక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందాలని ఇరువురు కోరారు. ప్లాన్ ప్రకారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో లెటర్ హెడ్ సిద్ధం చేశారు. ఆ తర్వాత మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెండ్రోజుల క్రితం డబుల్ బెడ్‌రూమ్‌లపై విచారణ జరుపుతున్న రెవెన్యూ సిబ్బందికి మంత్రి పేరు మీద వచ్చిన సిఫారసు లేఖలపై అనుమానం వచ్చింది. విషయాన్ని మంత్రి ఓఎస్డీ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించి ఫోర్జరీ సంతకాలు చేసినట్లు గుర్తించిన ఓఎస్డీ ఎస్ ఎం రాజేశ్వరరావు వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిపై గాలిస్తున్నారు.
Pak Smugglers: పంజాబ్‌లో ఇద్దరు పాక్ స్మగ్లర్లు అరెస్ట్.. భారీగా హెరాయిన్ స్వాధీనం