Site icon NTV Telugu

Minister Harish Rao : బీజేపీ వాళ్లది ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ

Minister Harish Rao countered the remarks of the Opposition in the Telangana Assembly budget meetings.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7న ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యు నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నేను నా పోడియం దగ్గర నిలబడి నిరసన తెలిపినా నన్ను సస్పెండ్‌ చేశారని ఆరోపించారు. బడ్జెట్‌పై అనుభవజ్ఞుడినైన నన్ను కావాలని సమావేశాల్లో లేకుండా చేశారంటూ విమర్శించారు.

అయితే దీనిపై మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ.. కార్పొరేషన్ లకు అప్పులు ఇచ్చే పరిధి పెంచింది బీజేపీ అని చెప్తున్నారని, ఇదో జోక్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంకి… కార్పొరేషన్‌ల అప్పులకు ఏం సంబంధం అని, ఇలాంటి మాటలు అరు సార్లు బడ్జెట్ పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణకి అన్యాయం చేస్తున్నది కేంద్రమని, 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. కేంద్రం భర్తీ చేసింది ఎన్ని అని ఆయన అన్నారు. కేంద్ర సర్వీసుల్లో 25 శాతం ఖాళీలు ఉన్నాయని, బీజేపీ ఉద్యోగ నియామకాల పై శ్వేత పత్రం ఇవ్వండని ఆయన డిమాండ్‌ చేశారు. మేము ఒక్క రోజే 80 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయించామన్నారు.

బీజేపీ వాళ్లది ఫేక్ వాట్సప్ యూనివర్సిటీ అని, బీజేపీ వాళ్ళంటే అబద్దం అడటం అలవాటే.. కానీ.. అన్ని తెలిసిన భట్టి కూడా అబద్ధాలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. కొత్త పోస్టులు క్రియేట్ చేసి భర్తీ చేశామని, భట్టి కూడా అవగాహన రాహిత్యం గా మాట్లాడితే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. 48,654 ఉద్యోగాలు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారని, ఇరిలవెంట్ పోస్టులు కొన్ని పోయాయని, రాహుల్ గాంధీకి చెప్పండి..బీజేపీ ఇస్తా అన్న ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడమని ఆయన అన్నారు.

https://ntvtelugu.com/harish-rao-made-comments-on-bhatti-vikramarka/
Exit mobile version