Site icon NTV Telugu

Sunitha Laxma Reddy: మాపై హత్యాయత్నం చేశారు.. సునీతా లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

Sunitha Laxma Reddy

Sunitha Laxma Reddy

Sunitha Laxma Reddy: వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాయత్నం చేశారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా మా గ్రామంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాయత్నం చేశారన్నారు. గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదన్నారు. గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారన్నారు. ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి నా అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. ఇంటి లోపలికి టపాసులు వేసి రాళ్లు, కర్రలతో ఇంట్లో ఉన్నవారిపై దాడికి దిగారన్నారు. దాడి చేసిన వారితో పాటు ఘటనను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోము.. మా సహనం పరీక్షించొద్దన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకే దాడులకు దిగుతోందన్నారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నమ్మకం లేదన్నారు.

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే నివాసం వద్ద కలకలం రేగిన విషయం తెలిసిందే. గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు వినాయక నిమజ్జనాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే ఇంటి గేటు ముందు బాణాసంచా కాల్చారు. అయితే ఇదేమిటని ఆ ఇంట్లో ఉంటున్న మణిదీప్ గౌడ్ అనే యువకుడు అడగడంతో దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఇంటిపై ఇటుకలు విసిరారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
Atishi: నాకు ఆ సీఎం సీటు వద్దు.. ఖాళీగానే ఉంచండి..!

Exit mobile version