NTV Telugu Site icon

Jishnu Dev Varma: నేడు మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..

Jishnu Dev Varma

Jishnu Dev Varma

Jishnu Dev Varma: కేథడ్రల్‌ చర్చి శత వసంత వేడుకల్లో భాగంగా నేడు మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. రోడ్డు మార్గాన ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్నారు. మెదక్ క్యాథడ్రల్ చర్చి వందేళ్ల వేడుకలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొననున్నారు. అనంతరం కొల్చారం బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థులతో గవర్నర్ పరస్పర చర్చ చేస్తారు. విద్యార్థినులతో కలిసి లంచ్ చేసి ఆహారాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో మెదక్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read also: Astrology: డిసెంబర్ 22, ఆదివారం దినఫలాలు

శతాబ్ది ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. 23వ తేదీ సోమవారం నాడు చర్చి ఆవరణలో ప్రత్యేక కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించనున్నారు. చర్చి వ్యవస్థాపకుడు రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్‌నెట్ యొక్క మూడవ తరం కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. డయాసిస్ ఇన్‌చార్జి బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ రూబెన్ మార్క్ పాల్గొని భక్తులకు దివ్య సందేశం అందిస్తారు. 15 మంది బిషప్‌లు, గురువులు, గురువేతరులు, వివిధ సంఘాల నాయకులు హాజరుకానున్నారు. ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే నాటక ప్రదర్శనలు, ప్రత్యేక ప్రార్థనలు, భక్తబృందంచే గానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మెదక్ ప్రెసిబిటరీ ఇన్‌ఛార్జి శాంతయ్య బుర్రకథ, చర్చి వ్యవస్థాపకుడు చార్లెస్ వాకర్ పాస్నేట్‌ గురించి ప్రదర్శనను నిర్వహించారు.
Game Changer : న భూతో న భవిష్యత్ అనేలా అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్