NTV Telugu Site icon

Medak Crime: మెదక్ లో మిస్టరీగా వరుస హత్యలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న దుండగులు

Medak Mistery

Medak Mistery

Medak Crime: మెదక్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్నశంకరంపేటలో 10 రోజుల వ్యవధిలో ఇద్దరి దారుణ హత్యకు గురైన ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు గుర్తు తెలియని దుండగులు.. ఇద్దరిని బండరాయితో కొట్టి చంపడమే కాకుండా.. వారిని పెట్రోల్ పోసి తగలబడుతుండటంతో స్థానికంగా కలవరపడుతుంది. గత నెల 24న చిన్నశంకరంపేట ప్రభుత్వాసుపత్రి వద్ద గుర్తుతెలియని యువకుడిని బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన మరువక ముందే.. ఈ రోజు చిన్న శంకరంపేట పద్మనాభ స్వామి గుట్ట వద్ద బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి యువకుడి హత్య చేయడంతో స్థానికంగా భయాందోళనకు గురిచేస్తుంది. ఇద్దరు మృతులు కూడా పరిశ్రమల్లో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి హత్య కేసు విచారణలోనే ఉండగా మరో హత్య వెలుగులోకి రావడంతో వరుస హత్యలు పోలీసులకు సవాల్ గా మారింది. రెండు హత్యలు ఒకే విధంగా ఉండటంతో ఇద్దరిని ఒకే వ్యక్తి చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుస హత్యలతో చిన్నశంకరంపేట వాసులు భయాందోళనకు గురవుతున్నారు. క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అసలు మెదక్ జిల్లాలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, గుర్తు తెలియని దుండగులు ఎందుకు ఇలా చేస్తున్నారని దానిపై ప్రశ్నార్థంగా మారుతుంది. వీరిద్దరి హత్యలు పోలీసులకు సవాల్ గా మారింది. ఊరిలో వున్న వారే ఇలా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వీరినే ఎందుకు హత్య చేశారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. వారిద్దరి ఫోన్ వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Harish Rao: ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపం.. హరీష్ రావు ఫైర్

Show comments