NTV Telugu Site icon

Hyderabad Mayor: మెట్రోలో ప్రయాణించిన మేయర్.. సేవలు, సౌకర్యాలపై ఆరా..

Hyderabad Mayor

Hyderabad Mayor

Hyderabad Mayor: మెట్రోలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి ప్రయాణించారు. మూసరంబాగ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు మేయర్ ప్రయాణించారు. గణేష్ నిమజ్జనం కోసం భక్తులకి స్వాగతం పలుకుతూ పోస్టర్ ఏర్పాటు చేయాలని మెట్రో అధికారులను మేయర్ కోరారు. నిమర్జనం రోజు ఎక్కువ సమయం వరకు మెట్రో రైలు నడపడంతో పాటు వచ్చే భక్తులకు సరైన ఏర్పాట్లు చేయాలని మేయర్ సూచించారు. మెట్రోలో ప్రయాణం చేస్తూ ప్రయాణికులతో మాట్లాడి మెట్రో సేవలపై సౌకర్యాలను మేయర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమైన వారితో మెట్రోలో కాసేపు సరదాగా గడిపారు. పిల్లల మధ్యలో కూర్చొని వారితో ముచ్చటించారు. అనంతరం ప్రజల సూచనలు ఎప్పటికీ అప్పుడు తెలుసుకోవాలని మెట్రో అఫిషియల్ కి మేయర్ గద్వాల విజయ లక్ష్మి సూచించారు.

Read also: Tollywood : సండే సూపర్ – 8 బ్లాక్ బస్టర్ సినిమా న్యూస్..

ఖైరతాబాద్‌లోని బడా గణేష్ దర్మనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు దినంతో పాటు చివరి రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. నాలుగు వైపుల నుండి లక్షల సంఖ్యలో భక్త జనం వస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ వినాయక నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ, రేపు నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున భక్తులను దర్శనానికి అనుమతించలేదు. ఇవాళ (ఆదివారం) మాత్రమే దర్శనానికి అవకాశం ఉండడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఖైరతాబాద్ కు తరలివస్తున్నారు. దీంతో ఖైరతాబాద్, లక్డీకపూల్, మెట్రో స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్ రైల్వే ట్రాక్, ఐమాక్స్, లక్డీకపూల్ మార్గాల్లో గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Minister Sridhar Babu Counter: ట్విట్టర్‌ లో కేటీఆర్‌ కామెంట్స్‌.. మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్‌..

Show comments