Site icon NTV Telugu

Ind vs Aus: ట్రైమింగ్ మార్చారు… బేగంపేట్ పోలీసులకు యువకుడు ఫిర్యాదు

Ind Vs Aus

Ind Vs Aus

Match ticket start time has changed: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు అయ్యింది. మ్యాచ్ టికెట్ల విక్రయం, తొక్కిసలాటలో భాగంగా ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. తాజాగా హెచ్. సి. ఎ. పై మరో కేస్ నమోదు చేశారు బేగంపేట్ పోలీసులు. మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం , మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ వ్యత్యాసం ఉందంటూ ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. టికెట్ పై మ్యాచ్ ప్రారంభ సమయం 7:30 నిమిషాలు ఉండగా 7 గంటలకే మ్యాచ్ ప్రారంభమైందని ఫిర్యాదు. దీంతో టికెట్ పై హెచ్.సి.ఎ తప్పుడు టైమింగ్ ఇచ్చిందంటు బేగంపేట్ పి.ఎస్ లో ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. కేస్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే టికెట్ విక్రయం సమయం లో చోటు చేసుకున్న తొక్కిసలాటపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యంలో.. తాజాగా టైమింగ్‌ విషయంలో ఫిర్యాదు రావడంతో.. దర్యప్తు ముమ్మరం చేశారు.

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్‌ 25న కీలక మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌ జరుగుతుండగా.. మ్యాచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. జింఖానా మైదానంలో టికెట్లు విక్రయం జరుగుతుందనే ఆశతో వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. టికెట్లు దొరకకపోవడంతో పాటు తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు కారణం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషనే కారణమని గాయపడిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అజారుద్దీన్ సహా హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ యాక్ట్ తో పాటు 420, 21,22/76 పలు సెక్షన్ల కిందబేగంపేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్ల నిర్వహణతో పాటు వాటిని బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపణలతో పాటు.. తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యం వహించడమే కారణమని చికిత్స పొందుతున్న వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ముందు నుంచి ఈ మ్యాచ్‌కు టికెట్ల విషయం పెద్ద సమస్యగానే మారింది. టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారని హెచ్‌సీఏపై ఆరోపణలు వచ్చాయి. ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలో బ్లాక్ లో టిక్కెట్లు విక్రయాలు జరుపుతున్న గుగులోత్ వెంకటేష్, ఇస్లవత్ దయాకర్, గుగులోత్ అరుణ్ అనే ముగ్గురు యువకులను ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 850ల టిక్కెట్ ను రూ.11,000లకి అమ్ముతుండగా పట్టుకున్న ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి.. ఆరు టిక్కెట్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఉప్పల్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు.
Harassment : నల్లగా ఉన్నావని దూషించిన భర్త.. ఊహించని పని చేసిన భార్య

Exit mobile version