Maoists: మావోయిస్టు సెంట్రల్ రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది 50 మంది మావోయిస్టులు మృతి చెందారని.. ఈ ఆమరణ దీక్షకు నిరసనగా నేడు (15న) తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర.. ఐదు రాష్ట్రాలకు బంద్‌కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. గత 15 రోజుల్లో 22 మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చారని ఆరోపించారు. ఈ నెల 6 వ తేదీన తెలంగాణ ఛత్తీస్ ఘడ్ బార్డర్ లో ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టు మృతి చెందిన ఘటనను తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యాకాండలు నరహంతక దాడిగా అభివర్ణించారు జగన్. ఈ ముగ్గురు హత్యలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆరోపించిన మావోయిస్టులు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పిట్టపాడ వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు ఏకపక్ష కాల్పులు జరిపారని ఆరోపణలు ఈ ఘటనను వ్యతిరేకించండని పిలుపునిచ్చారు.
Read also: Extra Peg Row: ‘ఎక్స్‌ట్రా పెగ్’ తీసుకోండి.. మహిళా మంత్రికి బీజేపీ నేత సూచన.. కాంగ్రెస్ ఫైర్
ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి ఛత్తీస్గడ్ రాష్ట్రం నుండి కూలీ పనులకు వచ్చిన కూలీలను బెదిరించి కొరియర్లుగా మార్చుకొని వారి సమాచారం తో ముగ్గురు కామ్రేడ్లని ఎన్కౌంటుర్ పేరుతో హత్య చేశారన్న జగన్.. ఈ నెల 6వ తేదీన తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు 5.10 నిమిషాలకు మావోయిస్టులు ఉన్న స్థలాన్ని చుట్టుముట్టి మూకుమూడిగా పోలీసు బలగాలు దాడి చేశాయని ఆరోపించారు. ఈ దాడిలో అమూల్యమైన ప్రజా వీరులు కామ్రేడ్ అన్నే సంతోష్ అలియాస్ సాగర్ శ్రీధర్, ఆప్కా మనీరం, పునేం. లక్ష్మణ్ ముగ్గురు అమరులైయ్యారని తెలిపారు. అమరులైన ముగ్గురు కామ్రేడ్స్ విప్లవ జోహార్లు చెబుతూ వారి ఆశయాలు సాధనకై పోరాడుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Astrology: ఏప్రిల్ 15, సోమవారం దినఫలాలు