మణికొండ మున్సిపాలిటీకి ఝలక్ తగిలింది. ఆ మునిసిపల్ 7వ వార్డు కౌన్సిలర్ బి.పద్మారావును ఆరు నెలల పాటు సస్పెండ్ చేసారు ఆ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్. నెక్నాంపూర్ లో ఓ పూరాతన దేవాలయాన్ని కూల్చివేత విషయంలో సస్పెన్షన్ వేటు పడింది. మున్సిపాలిటీలో ఏఈ విఠోబా పై కూడా వేటు పడింది. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితంగా పూర్తి చేయకపోవడం, పనుల్లో న్యాయత పరిణామాలు పాటించక పోవడం పై వేటు పడింది. కమీషనర్ జయంత్ కుమార్ ఏఈని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
మణికొండ మున్సిపాలిటీకి ఝలక్…
