NTV Telugu Site icon

Malkajgiri Lok Sabha Result 2024: మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ఈటల ముందంజ

Malkajgiri

Malkajgiri

Malkajgiri Lok Sabha Result 2024: మల్కాజిగిరి లోక్‌సభ స్థానం తాజా సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 331466 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సునీతకు 206008 ఓట్లు, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 103594 ఓట్లు వచ్చాయి. ఈటల 125458 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దేశంలోనే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం ప్రత్యేకం. ఓటర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం. ఇక్కడ 31,50,303 మంది ఓటర్లు ఉన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. కాగా.. ఇది పూర్తిగా పట్టణ పార్లమెంటరీ నియోజకవర్గం. ఈ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. దీంతో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్ తరపున పట్నం నుంచి సునీతామహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి నిలిచారు. మల్కాజిగిరిలో మూడు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. మే 13న జరిగిన పోలింగ్‌లో ఇక్కడ 50.78 శాతం పోలింగ్ నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 53.90 పోలింగ్ నమోదైంది, అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం స్వల్పంగా తగ్గింది. సికింద్రాబాద్‌లో బీజేపీకి 32 వేల ఆధిక్యం, హైదరాబాద్‌లో 59 వేల ఆధిక్యంలో ఎంఐఎం, వరంగల్‌లో 92,726 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌, భువనగిరిలో లక్షా 6 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్‌, చేవెళ్లలో 70 వేల ఓట్ల లీడ్‌లో బీజేపీ, జహీరాబాద్‌లో 17 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, పెద్దపల్లిలో 50 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్‌, నిజామాబాద్‌లో 39 వేల ఆధిక్యంలో బీజేపీ, నాగర్‌కర్నూల్‌లో 28 వేల ఆధిక్యంలో కాంగ్రెస్‌, కరీంనగర్‌లో లక్షా 13 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, ఖమ్మంలో 2.66 లక్షల ఆధిక్యంలో కాంగ్రెస్‌ ఓట్లు నమోదయ్యాయి.
Congress: రాహుల్ ట్రిక్ ఫలించిందా?.. పదేళ్లలో అత్యుత్తమ పనితీరును కనబర్చిన కాంగ్రెస్!