Males Special Bus Stopped: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అప్పటి నుంచి ఆర్టీసీ చరిత్రలోనే అత్యధికంగా ఆక్యుపెన్సీ పెరిగింది. బస్సులు రద్దీగా ఉన్నాయి. అయితే వారిలో అత్యధికులు మహిళలే. దీంతో పురుషులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సుల్లో మహిళలే ఎక్కువగా ఉండడంతో పురుషులకు సీట్లు లభించడం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలన్న డిమాండ్ పెరిగింది. అవసరమైతే పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతామని మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం బస్ డిపో ఆర్టీసీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. పురుషులకు మాత్రమే ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ బస్సు గత సోమవారం ఇబ్రహీంపట్నం – ఎల్‌బీనగర్ మధ్య ప్రారంభమైంది. కానీ అది మూడు రోజుల వ్యవహారంగా మారింది. బుధవారం వరకు బస్సును నడిపిన అధికారులు గురువారం రద్దు చేశారు. దీంతో మళ్లీ పురుషుల సమస్యలు మొదలయ్యాయి. అయితే, పురుషులు మాత్రమే గుర్తు ఉన్న బస్సు ఫోటో గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ అప్పటికే ఆ సర్వీస్ రద్దయిన విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
అసలు ఏం జరిగింది..?
ఇబ్రహీంపట్నం బస్ డిపో ఈ ‘పురుషులకు మాత్రమే’ బస్సును ప్రారంభించింది. ఇది ఎల్‌బి నగర్- ఇబ్రహీంపట్నం మధ్య నడుస్తుంది. కానీ ఈ మార్గంలో ప్రతి రెండు నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు వస్తుంది. ఫలితంగా, పురుషులు ప్రత్యేక బస్సు కోసం వేచి ఉండకుండా అందుబాటులో ఉన్న ఏదైనా బస్సు ఎక్కి వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. దీంతో పాటు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎక్కువగా ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఇందులో చాలా మంది విద్యార్థులు ఇబ్రహీంపట్నం దాటి వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు బస్సును రద్దు చేశారు.
Traffic Restrictions in Eluru: రేపు ఏలూరులో సీఎం పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు విధింపు.. ఎవరు ఏ రూట్లో వెళ్లాలంటే..?