NTV Telugu Site icon

Malakpet Accident: మూడురోజులుగా మృత్యువుతో పోరాడి శ్రావణి మృతి.. నిందితుడు అరెస్ట్‌

Malakpet Accident

Malakpet Accident

Malakpet Accident: మలక్ పేట హిట్ అండ్ రన్ కేసులో డాక్టర్ శ్రావణి ఇవాళ మృతిచెందింది. మూడు రోజులుగా నిమ్స్ లో మృత్యువుతో పోరాడిన శ్రావణి తలకి బలమైన గాయం కావడంతో ఇవాళ చనిపోయింది. శ్రావణికి ఆపరేషన్ చేసినా ప్రాణం దక్కలేదని నిమ్స్‌ వైద్యలు తెలిపారు. మూడురోజుల క్రితం శ్రావణికి ఆక్సిడెంట్‌ చేసి అక్కడినుంచి పరారైన వ్యక్తిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించినట్లు మలక్ పేట పోలీసులు తెలిపారు. నిందితుడు ఓల్డ్ మలక్ పేటకు చెందిన 19ఏళ్ళ ఇబ్రహీంగా గుర్తించారు. నిందితుడి కార్‌ సీజ్‌ చేసారు. నిందితుడికి లైసెన్స్‌, కారు కు సంబంధిచిన పేపర్లు కూడా లేవని పోలీసులు గుర్తించారు.

నిందితుడికి లైసెన్స్, కార్ కి పేపర్లు కూడా లేవని గుర్తించిన పోలీసులు హస్తినాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్ గా శ్రావణి పని చేస్తుంది. 25 రోజుల క్రితమే శ్రావణి తల్లి గుండె పోటుతో మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో శ్రావణి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబంలో నెలరోజుల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు.

Read also: Malakpet Accident: మూడురోజులుగా మృత్యువుతో పోరాడి శ్రావణి మృతి.. నిందితున్ని పోలీసులు..

సెప్టెంబర్‌ 21న నగరంలోని మలక్‌పేటలో ఓలా బైక్‌పై వెళ్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్ గా శ్రావణికి కారు ఢీకొట్టింది. ఆ తర్వాత నిందితులు కారును అక్కడ ఆపకుండా పరారయ్యారు. ఈ ఘటనలో శ్రావణికి తీవ్ర గాయాలవడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని సీసీఫోటేజ్‌ ఆధారంగా అదుపులో తీసుకున్నారు.

ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య మాట్లాడుతూ.. రాత్రి 7 గంటలకు హస్తినాపురం నుండి మలక్‌పేట్ కు బైక్ బుక్ చేసుకున్నారని, 7 గంటలకు హస్తినాపురం నుండి శ్రావణిని ఎక్కించుకొని బైక్ పై బయలుదేరానని ఆయన వెల్లడించారు. ముసారంబాగ్ దాటిన తర్వాత ఒక కారు వచ్చి నా బైక్ ని ఢీ కొట్టింది. ఎడమవైపు నుండి ఓవర్ టేక్‌ చేస్తూ చాలా స్పీడ్ డ్రైవింగ్ తో ఢీకొట్టారు. దీంతో ఇద్దరం బైక్ పై నుంచి కింద పడ్డాము. నాకు హెల్మెట్ ఉంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను. శ్రావణికి హెల్మెట్ లేకపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంబులెన్స్ రావడం ఆలస్యం అవుతుందని అక్కడ ఉన్న స్థానికలే కారులో యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి కావడంతో కారు నెంబరు కారుని గుర్తించలేకపోయాను. కానీ కారు మాత్రం రెడ్ కలర్ లో ఉందని వెంకటయ్య వెల్లడించారు.