Site icon NTV Telugu

Mahender Reddy : రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజం కాదు

తెలంగాణలో టీఆర్ఎస్ పై యుద్ధం చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. డీజీపీ మహేందర్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా శాఖ అధ్యక్షులు, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం కాదన్నారు మహేందర్ రెడ్డి. మా ఇంట్లో జారిపడిన సంఘటనలో నాకు ఎడమ భుజం పైన బోన్ (SCAPULA ) కు మూడు చోట్ల Hairline fractures జరిగాయని ఎక్స్ -రే, సి.టీ. స్కాన్, ఎం.ఆర్.ఐ లలో తేలింది. దీనితో, భుజం కదలకుండా కట్టు కట్టడం జరిగింది.

విరిగిన బోన్ మానేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినందునే ఫిబ్రవరి 18 వ తేదీ నుండి మార్చి 4 వతేదీ వరకు సెలవులో వెళ్లడం జరిగింది. తిరిగి, వైద్యుల సలహా మేరకు విధుల్లో జాయిన్ అవడం జరుగుతుంది. ఈ మేరకు రోజూ భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులను వాడడం జరుగుతోంది.ఈ వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందంటూ తప్పుడు, బాధ్యతా రహిత ప్రచారం చేయడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదు. తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈవిధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఒక ఉన్నత స్థాయిలో, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమే కాకుండా ప్రభుత్వంపై అపోహలు కలిగే అవకాశం ఉంది. ఈ తప్పుడు ఆరోపణలు పోలీస్ శాఖ స్తైర్యాన్ని దెబ్బతీయడం తోపాటు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముంది. బాధ్యతాయుత సీనియర్ అల్ ఇండియా సర్వీసు అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు విచక్షణ, సంయయనం పాటించాలని కోరుతున్నా అంటూ మహేందర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

https://ntvtelugu.com/tpcc-chief-revanth-reddy-slams-trs-govt-over-land-issues/
Exit mobile version