NTV Telugu Site icon

Journalists Mahadharna: నేడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో జర్నలిస్టులు మహాధర్నా

Journalists Mahadharna

Journalists Mahadharna

Journalists Mahadharna: ఇవాళ హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జేఎన్‌జే ఎంఏసీహెచ్‌ఎస్) జర్నలిస్టులు మహాధర్నా నిర్వహించనున్నారు. పేట్‌బషీరాబాద్‌లో కొనుగోలు చేసిన 16 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఈ ధర్నాలో పాల్గొంటారని జెఎన్‌జె హౌసింగ్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు పివి రమణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు రమణారావు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి 10 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పేట్ బషీరాబాద్ భూమిని తమ సొసైటీకి స్వాధీనం చేయకపోవడంతో జేఎన్ జే హౌసింగ్ సొసైటీ సభ్యులు ఈ మహా ధర్నా చేస్తున్నారు.

Read also: Jangaon: హృదయవిదారక ఘటన.. నీళ్ల బకెట్‌లో పడి 11 నెలల చిన్నారి మృతి

ఈ మహాధర్నాలో జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీ సభ్యులు కుటుంబ సమేతంగా పెద్దఎత్తున పాల్గొంటారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. మహాధర్నాకు వివిధ పార్టీల నేతల మద్దతు తెలుపుతూ.. కాంగ్రెస్ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతురావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఈటెల రాజేంద్ర, బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్, రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ, గీతామూర్తి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, యమునా పాఠక్, బీజేపీ అధికార ప్రతినిధి, రాణి రుద్రమ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి, కె. దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ, బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ పాల్గొననున్నారు.
TS Rain: తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ