Site icon NTV Telugu

Maha Shivratri 2022: వేములవాడలో ఉత్సవాలు ప్రారంభం

మహా శివరాత్రి వచ్చేస్తోంది.. దీంతో.. శైవ క్షేత్రాల్లో ఇప్పటికే మహా శివరాత్రి 2022 బ్రహ్మోత్సవాలు, శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.. ఇక, రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోనూ మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు.. ఇవాళ వైభవంగా రాజన్నసన్నిధిలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా.. నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.. మార్చి 1 తేదీన మహా శివరాత్రి పర్వదినాన రాజన్న దర్శనానికి భారీ ఎత్తున ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనాగా ఉండగా.. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. రూ.1.81 కోట్లు వెచ్చించి భారీ ఏర్పాట్లు చేశారు.. ఇక, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా 800 బస్సులను నడుపుతోంది టీఎస్ ఆర్టీసీ.. సుమారు 1500 పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.. ఆలయం చుట్టూ 700 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు.. భక్తుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్‌ 18004252038 ఏర్పాటు చేశారు.

Exit mobile version