NTV Telugu Site icon

Lord Of The Drinks: లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రియాంక్ సుఖిజా

Lord Of The Drinks

Lord Of The Drinks

Lord Of The Drinks Launched In Hyderabad: దేశవ్యాప్తంగా ఆహార, పార్టీ ప్రేమికుల నడుమ అత్యంత ప్రాచుర్యం పొందిన ‘లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌’ ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది. ఇది నవాబుల నగరంలో కలినరీ, నైట్‌లైఫ్‌ సీన్‌ను సమూలంగా మార్చడానికి సిద్ధమైంది. క్రమంగా విస్తరిస్తోన్న ‘లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌’.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 నగరాల్లోని 13 ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. యాంబియన్స్‌ పరంగా ప్రతి ఔట్‌లెట్‌కూ వినూత్నమైన గుర్తింపును కలిగి ఉండటంతో పాటు ఫుడ్‌ & బార్‌పై చక్కటి ప్రభావాన్ని చూపుతుంది. ఇది నగర సంస్కృతి, స్ఫూర్తిపై ప్రభావం చూపనుంది.

హైదరాబాద్‌లో నిత్యం మారుతున్న ఆహార, నైట్‌లైఫ్‌ వాతావరణంలో.. తమదైన ప్రత్యేకతను చాటేందుకు టైకూన్స్‌ యష్‌ త్రివేది, క్రిష్‌ త్రివేదిలు పూర్తిగా సన్నద్ధమయ్యారు. సాటిలేని వైభవం, డిజైన్‌, ఫుడ్‌, కాక్‌టైల్స్‌తో అత్యంత అందమైన ప్రాంగణం తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పాటు నగర మూలాలను ఏమాత్రం మరిచిపోకూడదనే ప్రయత్నంలో ‘లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌’ను తీసుకువచ్చారు. దీనికోసమే వీరు దేశంలో ఫుడ్‌ అండ్‌ డ్రింక్స్‌ రంగంలో దిగ్గజంగా గుర్తింపు పొందిన ఫస్ట్‌ ఫిడెల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ప్రియాంక్ సుఖిజాతో భాగస్వామ్యం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఇన్నాటో హాస్పిటాలిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ యష్‌ త్రివేది మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఎల్‌ఓటీడీ వినూత్నంగా ఉండటంతో పాటు ప్రత్యేకమైన నేపథ్యాన్ని ఆతిథ్యనగరపు సంస్కృతి, వారసత్వం, ఇంగ్రీడియెంట్స్‌ ప్రభావంతో తీర్చిదిద్దుతుంటాము. ఈ భాగస్వామ్యంలో ఎలాంటి షరతులూ లేవు. ఈ కారణం చేత ఫస్ట్‌ ఫిడెల్‌ యొక్క ప్రపంచశ్రేణి ప్రమాణాలు, నైపుణ్యం, హైదరాబాద్‌ చాతుర్యం, అభిరుచిని కలుసుకుంటుంది. ఇది ఒక సంపూర్ణ గేమ్‌ ఛేంజర్‌గా నిలువనుంది’’ అని అన్నారు.

ఇన్నాటో హాస్పిటాలిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఖుష్‌ త్రివేది మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో సాటిలేని డైనింగ్‌, నైట్‌లైఫ్‌ అనుభవాలను లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌ అందిస్తుంది. అత్యంత రుచికరమైన వంటకాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌ మిమ్మల్ని అసాధారణమైన గ్యాస్ట్రోనమిక్‌ ప్రయాణానికి ఆహ్వానిస్తున్నందున మహరాజులా ప్రవేశించడంతో పాటు సర్వోత్తమమైన ఆహారం, పానీయాల ఎంపికతో మిమ్మల్ని మీరు సంతృప్తిపరుచుకోవచ్చు. సాటిలేని కలినరీ అనుభవాలను లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌ అందిస్తుంది. మా చెఫ్‌ అమిత జాగ్రత్తగా మెనూ తీర్చిదిద్దారు. ఇది మా అభిమానుల విభిన్నమైన రుచులు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటుంది’’ అని అన్నారు.

ఈ లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌‌లో ఇంటీరియర్స్‌ను సుప్రసిద్ధ డిజైనర్‌ అమీత్‌ మిర్పూకి చేశారు. ఆధునిక కళ యొక్క ఫ్లూయిడిటీ స్ఫూర్తితో ఆయన ఇంటీరియర్స్‌ రూపొందించారు. దీనిలో కర్వ్స్‌ను ఎస్మెమ్మిట్రీతో జోడించారు. 24వేల చదరపు అడుగుల ఈ ప్రాంగణంలో 45 అడుగుల ఎత్తు లాబీ ప్రవేశంలో ఉంటుంది. ఆ తరువాత ఇండోర్‌ ఐల్యాండ్‌ బార్‌, భారీ కిటికీలు ఉంటాయి. స్టేజ్‌ బ్యాక్‌డ్రాప్‌గా మరియు ఆర్గానిక్‌ ఔట్‌డోర్‌ వ్యూ అత్యంత ఆహ్లాదకరమైన పచ్చదనం కలిగి ఉంటుంది.

కిచెన్‌కు చెఫ్‌ శివ నేతృత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలను అన్వేషించడంతో పాటుగా ఈ మెనూకు స్థానిక మరియు గ్లోబల్‌ టచ్‌ అందిస్తూనే తన సిగ్నేచర్‌ డిషెస్‌ అయిన క్రీమ్‌ చీజ్‌ డంప్లింగ్‌, ల్యాంబ్‌ ఖీమా ఎక్లెయిర్స్‌, వెగాన్‌ సీజర్‌ సలాడ్‌, అప్రికాట్‌ కెబాబ్‌, ట్రఫెల్‌ మష్రూమ్‌ అర్నాసినీ, ఘీ రోస్ట్‌ చికెన్‌, క్రాబ్‌ ఈ సిగర్‌, లార్డ్స్‌ చూజా, చురాన్‌ ల్యాంబ్‌ చోప్స్‌, చికెన్‌ పెప్పరోనీ పిజ్జా, మటన్‌ కకోరీ కెబాబ్‌, సుమాక్‌ రబ్డ్‌ ఫిష్‌, మ్యాంగో కాలిఫోర్నియా రోల్‌, బ్లూ పీ డిమ్‌సమ్‌, మెయిన్స్‌లో శ్రీలంకన్‌ చికెన్‌ కర్రీ, అస్పారగస్‌ మలై కోఫ్తా, స్మోకీ రోగన్‌ జోష్‌ , సిగ్నేచర్‌ డెస్సర్ట్స్‌ మల్బరీ ట్రెస్‌ లెచా, టిరా మిస్‌ యు మరియు మరెన్నో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రుచుల సమ్మేళనంగా ఉండటం వల్ల మెనూ అన్ని రకాల అంటే ఆసియన్‌ మొదలు లెబనీస్‌ వరకూ అందరి అవసరాలనూ తీరుస్తుంది. లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌, విభిన్న రకాల సంస్కృతులు, రుచులు సమ్మేళనంగా ఉండటంతో పాటుగా మిమ్మల్ని ఆనందాశ్చర్యాలకు గురి చేస్తాయి.

మా స్విర్ల్‌ బార్‌ మీలో అంతర్లీనంగా దాగిన కోరికలను మ్యాజికల్‌ టిప్పెల్స్‌ మరియు స్ఫూర్తిదాయక డెకోషషన్స్‌తో తీసుకురావడంతో పాటుగా మా మిక్సాలజిస్ట్‌ల వేళ్ల చివర ఫ్లెయిర్‌, ఫైర్‌, స్మోక్‌ను సైతం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. మిక్సాలజిస్ట్‌ ప్రశాంత్‌ మిశ్రా ఈ బార్‌కు నేతృత్వం వహిస్తారు. గత 15 సంవత్సరాల అనుభవాన్ని ఆయన తన అప్రాన్‌ కింద కలిగి ఉండటంతో పాటుగా విభిన్న పద్ధతులు, పదార్ధాలతో కూడిన కాక్‌టైల్స్‌ను మీకు రుచి చూపుతార.అంతర్జాతీయంగా ఎంపిక చేసిన అత్యుత్తమ స్పిరిట్స్‌, వైన్స్‌, లిక్కర్స్‌కు హైదరాబాద్‌ స్ఫూర్తిని జోడించి స్ఫూర్తిదాయక అనుభవాలను అందిస్తారు.

ఎల్‌ఓటీడీలో అత్యంత కీలకంగా నిశ్శబ్ధ క్షణాలు, వేడుకలు, ఉల్లాసమైన సాంగత్యాన్ని ఆస్వాదించేటప్పుడు మీ అనుభవాలను మెరుగుపరచాలనే ప్రేమ ఉంది. అత్యుత్తమ ఆహారం, బేవరేజస్‌ను అత్యుత్తమంగా మిళితం చేసినప్పుడు లౌకికతను అసాధారణంగా మార్చడంతో పాటుగా గతాన్ని వర్తమానానికి కలుపుతుంది. గతం ఎప్పటికీ గతమే!

లార్డ్‌ ఆఫ్‌ ద డ్రింక్స్‌ యొక్క అసలైన అనుభవాలను ఆస్వాదించండి, ఇక్కడ మేము హైదరాబాదీలందరి కోరికలనూ తీరుస్తాము

Show comments