ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది ఎక్కువ వడ్డీ అయినా సరే లోన్ లు తీసుకుంటారు. సరైన సమయంలో చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్ల బారినపడుతుంటారు. ఈ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఇటీవల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. లోన్ రికవరీ పేరుతో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ లోన్ తీసుకున్న వారిని భయందోళనకు గురి చేస్తారు. అయితే ఇలా వ్యవహరించిన వారిపై ఫిర్యాదు చేసే హక్కును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
Read Also: Surekha Vani : సురేఖ వాణి కెరీర్ పాడు చేసింది ఆ స్టార్ హీరోనా?
కొవిడ్ సమయంలో బ్యాంకులు కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ ఇప్పుడు మళ్లీ వసూళ్ల వేట మొదలైంది. రుణాలని వసూలు చేయాలంటే ఏజెంట్లకి ఆదేశాలు జారీ కావడంతో వీళ్లు కస్టమర్లపై ఒత్తిడి పెంచుతూ వారిని వేధింపులకి గురిచేస్తున్నారు. అయితే, తాజాగా నిజామాబాద్ జిల్లాలో లోన్ యాప్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. నవిపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి లోన్ యాప్ నుంచి ఏజెంట్లు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని సదరు వ్యక్తి ఆందోళనకు గురయ్యాడు.
అయితే.. లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం తక్షణం చెల్లించాలని లోన్ ఏజెంట్లు డిమాండ్ చేయడంతో తాను ఎలాంటి లోన్ తీసుకోలేదని బాధితుడు చెబుతున్నాడు. లోన్ చెల్లించకపోతే.. ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సెల్ ఫోన్ డేటా హ్యాక్ చేసి వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు రికవరీ ఏజెంట్ల కోసం విచారిస్తున్నారు.
