20 ఏళ్ళ కోసం ప్లాట్లు చేసి… అమ్మితే వివరాలు ధరణి లో లేవు. 20 ఏళ్ళ తర్వతా కూడా ధరణిలో పాత యజమాని పేరు రావడంతోనే హత్యలు జరుగుతున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ తప్పుడు నిర్ణయాల వల్ల నిన్న హత్యలు జరిగాయి. పాత భూ యజమానులకు హక్కులు ఇవ్వడం ఏంటో..? ధరణిని అడ్డం పెట్టుకొని… హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అక్రమాలు జరుగుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ నమూనా పోయింది.బీహార్ నమూనా వచ్చేసింది. కేసీఆర్ ప్రయత్నం తెలంగాణ ఉనికికి ప్రమాదం కానుంది. తెలంగాణ ప్రజలు మేల్కొవాలి అప్రమత్తం అవ్వాలి. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కూడా బీహార్. సమాచారం ఇవ్వండి అంటే అయన కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ ని జైల్ కి పంపిస్తా అంటున్నారు బండి సంజయ్.
డీవోపీటీలో అధికారులపై విచారణ చర్యలు తీసుకుంటే వారంలో అధికారుల బండారం బయట పడుతుంది. బండి సంజయ్..కిషన్ రెడ్డి కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. డీజీపీ మహేందర్ రెడ్డి మనసుకు గాయం అయ్యిందా..? మనిషికి గాయం అయ్యిందా..? మహేందర్ రెడ్డికి ఏమైంది అనేది హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి. ఆయనకు గాయం అయినట్టు…వైద్యం చేయించుకున్నారు నేనే ఎక్కడా చూడలేదు. మహేందర్ రెడ్డి లీవ్ లో వెళ్తే.. బీహారీ వాళ్ళే దొరికారా…? తెలంగాణ ఐపీఎస్ కు ఇవ్వొచ్చు కదా డీజీపీ పదవి అన్నారు రేవంత్ రెడ్డి.
