NTV Telugu Site icon

viral video : అరె ఏంట్రా ఇది.. ల్యాప్ టాప్ ను అలా కూడా వాడుతారా?

Hderabad (3)

Hderabad (3)

ఈ మధ్య కాలంలో జనాలకు తెలివి మీరిపోతుంది.. అందరిని అవాక్కయ్యేలా కొన్ని పనులను చేస్తూ సోషల్ మీడియాలో తెగ ఫెమస్ అవుతున్నారు.. ఇక సోషల్ మీడియాలో కూడా రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. నిత్యం వేలాది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి..అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. మరికొన్ని భయానకంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అందరికీ కొంచెం షాకింగ్ గా అనిపిస్తుంది..

ఈ వీడియోలో ఓ వ్యక్తి తన కాళ్ళ మధ్య పెట్టుకొని వెళుతూ ప్రయాణిస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్లాలంటే చాలామంది ల్యాప్టాప్ ను చాలా జాగ్రత్తగా తీసుకొని వెళుతుంటారు. లాప్టాప్ జాగ్రత్తగా చూసుకోకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. దానిమీద కొంచెం బరువు పడ్డ లేదంటే లాప్టాప్ కింద పడిపోయిన అది అసలు పనికిరాదు. మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంటుంది. ఇదంతా ఎందుకని లాప్టాప్ ఉపయోగించేవారు దీనిని చాలా జాగ్రత్తగా వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ప్రయాణాలలో తమకంటే ఎక్కువగా లాప్టాప్ ను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రయాణం చేస్తారు.

అంత విలువైన దాన్ని కాళ్ళ కింద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి స్కూటీ పై వెళుతూ తన లాప్టాప్ ను కాళ్ళ మధ్యలో పెట్టుకుని కనిపించాడు. దీంతో వెనక ప్రయాణిస్తున్న కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త వైరల్ అవుతుంది.. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ లాప్టాప్ ను ఎవరైనా అక్కడ పెట్టుకుంటారా, అది కింద పడితే ఇంకేమైనా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నీకో దండం రా బాబు , అది లాప్టాప్ నా లేక ఇంకేమైనా అంటూ కామెంట్లు పెట్టారు. ఏది ఏమైనా ప్రస్తుతం వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఒక లుక్ వేసుకోండి..