NTV Telugu Site icon

BRS KTR: అసత్య ఆరోపణలు చేస్తే సీఎం అయినా, మంత్రికైనా తాట తీస్తా..!

Brs Ktr

Brs Ktr

BRS KTR: అసత్య ఆరోపణలు చేఅసత్య ఆరోపణలు చేస్తే మంత్రి ని అయినా, సీఎం ని అయినా తాట తీస్తాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ తో సంబంధం లేదని అన్నారు. నేను ఎవర్నో హీరోయిన్ ను బెదిరించాను అని ఒక మంత్రి ఆరోపణలు చేశారని మండిపడడ్ఆరు. నాకు హీరోయిన్ ను బెదిరించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. నాపై అసత్య ఆరోపణలు చేస్తే మంత్రి ని అయినా, సీఎం ని అయినా తాట తీస్తానని హెచ్చరించారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ వస్తే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని చెప్పామన్నారు. ఇప్పుడే అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో నీళ్ల కోసం తల్లడిల్లి పోతున్నారని తెలిపారు.

Read also: Geetanjali Malli Vachindhi: జాగ్రత్త గురూ.. గీతాంజలి మళ్ళీ వచ్చింది’..!

హైదరాబాద్ లో నీటి కోసం యుద్ధాలు మొదలు అయ్యాయన్నారు. ఈ అసమర్థ సీఎం దన వనరులు ఢిల్లీ తరిలించే ప్రయత్నం తప్ప జల వనరులు తెచ్చే ప్రయత్నం చేయట్లేదన్నారు. మేము 38 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టామన్నారు. దాని నిర్వహణ కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేక పోతుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఖచ్చితంగా పోతాయన్నారు. ఖైరతాబాద్, ఘనపూర్ లలో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఈ ఆదివారం లోపు స్పీకర్ తేల్చకుంటే.. కోర్టు కు పోతామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా అనర్హత వేయాలని ఉందన్నారు. కాంగ్రెస్ కు హైదరాబాద్ ఓటు వేయదు, అది అందరికీ తెలుసు, అందుకే హైదరాబాద్ లో ప్రజలపై కక్ష కట్టావా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నాడని తెలిపారు.

Read also: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటన వాయిదా.. కారణం ఏంటంటే?

ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి అని మండిపడ్డారు. సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడని తెలిపారు. బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్ లు వస్తున్నాయన్నారు. నీకు నిజాయితీ ఉంటే ఫ్రీ గా నీళ్ల ట్యాంకర్ లు ఇవ్వమన్నారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ వివరాలు అన్ని రేవంత్ రెడ్డి కి పంపిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారని తెలిపారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని, తాట తీస్తాఅని.. నేను భయపడను అంటూ మండిపడ్డారు.
Top Headlines@1PM: టాప్‌ న్యూస్

Show comments