NTV Telugu Site icon

Minister KTR: నేడు వరంగల్ లో కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

Minister Ktr

Minister Ktr

Minister KTR: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో హన్మకొండకు వెళ్లనున్నారు. హన్మకొండలో రూ.900 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా హన్మకొండలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయ ఆవరణలో 100 కోట్లతో నిర్మించనున్న ఐటీ టవర్, 70 కోట్లతో హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ, ఎంఆర్‌ఐ స్కానింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 10 కోట్లతో ఎంజీఎం, 7 కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం 2.15 గంటలకు పోతన సబ్ స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన లాండ్రో మార్ట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు దుప్పకుంటలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు. మంత్రి కేటీఆర్ సభలను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

మంత్రి కేటీఆర్‌ పర్యటన ఇలా..

* ఉదయం 9.30 గంటలకు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీకి చేరుకుంటారు.
* 9.45 గంటలకు హనుమకొండలో అర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. ఐటీ టవర్‌, కుడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేస్తారు.
* 10.10 గంటలకు బంధం చెరువు వద్ద 15 ఎంఎల్‌డీ ఎస్టీపీని, దర్గా కాజీపేటలో బస్తీ దవాఖాన ప్రారంభం.
* 10.30 గంటలకు నిట్‌ జంక్షన్‌ ప్రారంభం.
* 10.45 గంటలకు మడికొండలోని ఐటీ పార్కులో క్వాడ్రెంట్‌ ఐటీ కంపెనీ ప్రారంభం.
* 11.30 గంటలకు బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో బహిరంగసభలో పాల్గొంటారు.
* మధ్యాహ్నం 1గంటకు హనుమకొండలో నూతన బస్టాండ్‌కు శంకుస్థాపన చేస్తారు.
* 1.20 గంటలకు అలంకార్‌ జంక్షన్‌ ప్రారంభం.
* 1.40 గంటలకు పోతన ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌, లాండ్రీమార్ట్‌, స్మార్ట్‌ లైబ్రరీ ప్రారంభం.
* 1.50 గంటలకు భద్రకాళీ సస్పెన్షన్‌ బ్రిడ్జి, మ్యూజికల్‌ ఫౌంటేన్‌, ప్లానిటోరియం, మున్నూరుకాపు భవన్‌కు శంకుస్థాపన. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో చేపట్టే రూ.250 కోట్ల టఫిడ్కో, రూ.50 కోట్ల స్మార్ట్‌ సిటీ పనులకు శంకుస్థాపన.
* 2.00 గంటలకు భరోసా సెంటర్‌ ప్రారంభం.
* 2.15 గంటలకు పద్మాక్షి రోడ్డులో రజక భవన్‌ ప్రారంభం. లాండ్రోమార్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన
* 2.30 గంటల నుంచి 3.00 గంటల వరకు భోజన విరామం.
* 3.00 గంటలకు వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని దూపకుంటలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభం.
* 3.15 గంటలకు వరద ముంపు నివారణ పనులకు శంకుస్థాపన.
* 3.30 గంటలకు ఖిలావరంగల్‌లో సంక్షేమ పథకాల పంపిణీ.. లబ్ధిదారులతో బహిరంగసభ.
* 4.45 గంటలకు తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సందర్శన
* 5.00 గంటలకు వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, అధికారులతో సమావేశం.
* 5.30 గంటలకు మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు
TS Temperature: తెలంగాణలో వేడి వాతావరణం.. వచ్చే పది రోజులు పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు