Site icon NTV Telugu

KTR Tweet: ఫార్ములా ఈ రేస్ రద్దు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్

Ktr Revanth Reddy

Ktr Revanth Reddy

KTR Tweet: హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ రద్దు పై కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమే అని మండిపడ్డారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం దేశం యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయని సూచించారు. అయితే ఈ రేసింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం పై కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. చాలా ఈ రేసింగ్ చూడటానికి ఆశక్తి చూపారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేసింగ్ పై తెలంగాణ ప్రజలు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించామని తెలిపారు.

Read also: Giriraj Singh: బెంగాల్‌లో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం.. ఈడీపై దాడిని ఖండించిన కేంద్రమంత్రి

హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా రేస్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ-రేస్ సీజన్ 10 నాలుగో రౌండ్ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా.. అయితే ఫార్ములా వన్ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని నిర్వాహకులు తెలిపారు. గతేడాది అక్టోబర్ 30న చేసుకున్న ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేసు రద్దు ప్రకటించిన ఫార్ములా.. ఈ ఆపరేషన్లకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ శాఖ తెలిపింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని FEO తెలిపారు.
Mahesh Babu: వెకేషన్‌ కంప్లీట్.. హైద్రాబాద్‌లో ల్యాండ్ అయిన బాబు!

Exit mobile version