NTV Telugu Site icon

న‌న్ను ఎలా అడ్డుకుంటారు..? కౌశిక్‌రెడ్డి కౌంటర్‌ ఎటాక్

అక్కడక్కడ కొన్ని ఘటనలు మినహా హుజురాబాద్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది.. అయితే, బీజేపీ శ్రేణులు తనను అడ్డుకోవడంపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు టీఆర్ఎస్‌ నేత కౌశిక్‌రెడ్డి… వీణవంక మండలం గణుముక్కలలో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వచ్చారు కౌశిక్‌రెడ్డి.. అయితే, పోలింగ్‌ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై మండిపడ్డ బీజేపీ నేతలు.. అసలు కౌశిక్‌రెడ్డికి ఇక్కడ పనేంటి అంటూ ఫైర్‌ అయ్యారు. కౌశిక్‌తో వాగ్వాదానికి దిగారు… ఇక, పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కౌశిక్‌ రెడ్డి.. తాను ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి చీఫ్ ఎల‌క్షన్ ఏజెంట్‌గా ఉన్నాను.. నాకు పోలింగ్ బూతుల వ‌ద్దకు వెళ్లే అధికారం ఉంది.. న‌న్ను అడ్డుకోవడానికి బీజేపీ వాళ్లకు ఉన్న అధికారం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీజేపీ వాళ్లు నన్ను ఎలా అడ్డకుంటారు? ఎందుకు అడ్డుకుంటారు? అని ప్రశ్నించిన ఆయన.. ఇది కేవ‌లం ఓడిపోతామ‌నే ఫ్రస్ట్రేష‌న్‌తో చేస్తున్న పనిగా కౌంటర్‌ ఎటాక్ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత‌లను ఓడించి ప్రజలు క‌చ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు కౌశిక్‌ రెడ్డి.