Korutla Transco: జగిత్యాల జిల్లా కోరుట్ల ట్రాన్స్ కో ఉద్యోగుల దాడి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోరుట్ల ట్రాన్స్ కో ఉద్యోగులు కార్యాలయం ఆవరణలోనే గొడవపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతనెల 19న కోరుట్ల రూరల్ విభాగంలో పనిచేసే ట్రాన్స్ కో సబ్ ఇంజినీర్, అదే కార్యాలయంలో పనిచేసే ఓ ఆర్టిజన్ ఉద్యోగి కోరుట్ల పట్టణ ట్రాన్స్ కో కార్యాలయం ఆవరణలోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కార్యాలయంలోనుంచి మరో ఇద్యోగిని పట్టుకుని నేలపై వేసి చితకబాదడంపై సర్వత్రా ఉత్కంఠగా మారింది. అక్కడ పనిచేస్తున్న సహ ఉద్యోగులు కూడా సినిమా చూస్తున్నట్లు ఉండిపోయారు. వారిని ఎవరూ ఆపడానికి ముందుకు రాలేదు. కాసేపటికి ఇక సహ ఉద్యోగులు వారిని ఆపడానికి ముందుకువెళ్లారు. అక్కడే వున్న మరో వ్యక్తి ఈ వ్యవహారం కాస్తు తన సెల్‌ఫోన్ లో బంధించారు. అయితే గొడవ పడిన వారిద్దరూ అంతటితో ఆగక పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
Read also: SI Anil Issue: నేడు జగిత్యాల బంద్.. ఎస్ఐపై సస్పెండ్ ఎత్తివేయాలని వీహెచ్‌పీ డిమాండ్
కార్యాలయంలో ఉన్న తాగు నీటి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొందని , ఒకరిపైఒకరు దుర్భాషలాడుతూ గొడవకు దారితీయగా కోపంతో ఊడిపోయిన సహ ఉద్యోగి మరో ఉద్యోగిపై దాడి చేసుకున్నారని విశ్వసనీయ సమచారం. అయితే ట్రాన్స్ కో ఉద్యోగులు అయి ఉండి కార్యాలయంలోనే ఇలా దాడి దిగడపై తీవ్ర దుమారం రేపుతుంది. సోషల్ మీడియా లో వీడియో వైరల్ కావడంతో ఈ మేరకు పోలిసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఒకరిపై మరొకరు అంత దురుసుగా దాడి చేసుకునేంతగా ఒక్క నీటి వ్యవహారమే కారణమా? లేక వీరిద్దరిమధ్య ఏదైన గొడవలు వున్నాయా? ఇంత జరుగుతున్నా ఉద్యోగులు కూడా ఎందుకు అడ్డుకోలేదు? అనే ప్రశ్నలు మొదతుండటంతో కార్యాలయంలో ఉన్న సహ ఉద్యోగులను కూడా పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్స్ కో ఉద్యోగుల దాడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ కో సిబ్బంది అయి ఉండి ఇలా దాడి చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.
Karnataka Election Results Live Updates: కర్ణాటక తీర్పు.. గెలుపెవరిదో?