NTV Telugu Site icon

కేసీఆర్… పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది

సిఎం కెసిఆర్ పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నీకు మానవత్వం ఉందా.. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చుతాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పావు కాదా ఏమయింది కేసీఆర్ ? అంటూ ప్రశ్నించారు. ఎందుకు కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చడం లేదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు కేసీఆర్ ? అని నిలదీశారు. కరోనాతో ప్రజలు పిట్టల రాలుతుంటే నీ కంటికి కన్పించడం లేదా.. కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నీ కొడుకు కేటీఆర్ కు అప్పగించావడని మండిపడ్డారు. కరోనాను ఆరోగ్య శ్రీలో ఎప్పుడు చేర్చుతారని కేటీఆర్ ను ప్రజలు ట్విట్టర్ వేదికగా నిలదీస్తున్నారని.. రాష్ట్రంలో అయ్యా…కొడుకుల డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. నువ్వు పాలన సాగించేది ప్రజల కోసమా…నీ కుటుంబం కోసమా ? కేసీఆర్… నీ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుందని నిప్పులు చెరిగారు. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని..కేసీఆర్ కు ప్రజల ఉసురు తగులుతుందన్నారు. కేసీఆర్ ఇకనైనా కండ్లు తెరిచి.. కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు.