వనపర్తిలో జరిగిన బహిరంగసభలో.. రేపు ఉదయం కీలక ప్రకటన చేస్తాను.. రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు అంతా టీవీలు చూడండి అంటూ ప్రకటించి అందరిలో ఆసక్తిపెంచారు సీఎం కేసీఆర్.. ఇక, దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ కోటమిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రేపు నిరుద్యోగుల కోసం ఉదయం 10 గంటలకు ప్రకటన చేస్తానని కేసీఆర్ అనడం సంతోషాన్ని కలిగించింది.. రాష్ట్ర ప్రజలలో ఒకడిగా నేను రేపటి మీ ప్రకటన కోసం వేచి చూస్తున్నాను అన్నారు.. మీ 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు 3116 ఇస్తానని తెలిపారు.. రాష్ట్రంలో 40 లక్షల నిరుద్యోగులు నిరుద్యోగభృతి కోసం ఎదురుచూస్తున్నారన్న ఆయన.. 37 నెలల నిరుద్యోగుల బకాయిలు ఇస్తానని ప్రకటిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
Read Also: TRS: సీఎం పర్యటనకు డుమ్మా.. ముగ్గురు అసంతృప్త నేతలు భేటీ..!
ఇక, ఖాళీగా ఉన్న లక్షా తొంభైవేల ఉద్యోగాలకు ఒకే దఫాలో నోటిఫికేషన్ ప్రకటిస్తారని అనుకుంటున్నానని.. ఉపాధ్యాయుల, DSC నిరుద్యోగులు నోటిఫికేషన్ రాక ఏజీ లిమిట్ అయిపోయిన వారి కోసం కూడా మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు మీరు చూస్తూనే ఉన్నారని తన ప్రకటనలో పేర్కొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తెలంగాణ రావటానికి యువకులు, నిరుద్యోగులు ముఖ్య కారణం.. మీరు ప్రకటించబోయే ప్రకటనలో ఈ ప్రధాన నిరుద్యోగ సమస్యలు ఉంటాయని అనుకుంటున్నా.. మేం ఆశించినట్టు మీరు రేపు ప్రకటన చేస్తే నేనే మీ ఫొటోకు పాలాభిషేకం చేస్తాను అని ప్రకటించారు.