Site icon NTV Telugu

Komati Reddy: బీఆర్ఎస్‌ దుకాణం బంద్‌.. 8 మంది బీజేపీ నుంచి వస్తారు..!

Congress Komati Reddy

Congress Komati Reddy

Komati Reddy: బీజేపీ పార్టీలోని 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎంపీ ఎన్నికల్లో మాకు.. బీజేపీ కె పోటీ అన్నారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయిందన్నారు. భువనగిరి టికెట్ గురించి నేను అడగలేదు.. రాజగోపాల్ రెడ్డి అడగలేదని క్లారిటీ ఇచ్చారు. మా అన్న వాళ్ళ అబ్బాయి కూడా మాకు చెప్పకుండా దరకస్తూ చేశాడని అన్నారు. ఇప్పటికే మన ఇంట్లో మంత్రి.. ఎమ్మెల్యేలు ఉన్నామన్నారు. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలి కదా! అన్నారు. ప్రభుత్వాన్ని బీజేపీ కులగొడతాం అంటే ప్రజలు ఊరుకుంటారా? ఇదేమైనా.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటు చేస్తారు జనమన్నారు. అవసరం అయితే బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారన్నారు.

Read also: Komati Reddy: పెద్ద సినిమాలు.. థియేటర్ ల దోపిడీ.. కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

కొందరు రిటైర్డ్ అయిన అధికారులు పొమ్మన్నా పోతలేరని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడితే డబుల్ బెడ్ రూమ్ సరిపోతుంది అనుకున్నారు రేవంత్.. కానీ జైల్లో ప్రగతి భవన్ కట్టాల్సి వస్తుందేమో అన్నారు. యాదగిరిగుట్టకి బంగారం వసూలు చేశారన్నారు. ఎక్కడ ఉందో తెలియదన్నారు. గోపురం కి బంగారం తాపడం చేయించొచ్చని, ఇప్పటి వరకు పని చేసిన ఈఓ గీతా డిప్యూటీ సీఎం లెక్క చేశారన్నారు. బయటకు పంపే వరకు అక్కడే ఉంది ఆమె అన్నారు. మరోవైపు కేటీఆర్ పై వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ యూస్ లెస్ ఫెల్లో అన్నారు. మూడు పిల్లర్లు కుంగితే ఏమవుతుంది అంటున్నాడని మండిపడ్డారు. ఫోన్ ట్యాప్.. చేస్తే చేసి ఉంటారు అంటాడన్నారు.

Read also: Kakarla Suresh: టీడీపీ జెండాను ఆవిష్కరించిన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్

అమెరికా పోయి వచ్చాడు తెలివి కలిగినోడు అనుకున్నామని తెలిపారు. సుమోటో గా కేటీఆర్ పై కేసు పెట్టాలన్నారు. ఫోన్ ట్యాప్ చేసినట్టు ఒప్పుకున్నాడు.. దాని మీద కోర్టుకు వెళ్తే అరెస్ట్ ఐతడు అన్నారు. ఫోన్ ట్యాప్ లో అరెస్ట్ అయిన వాళ్ళు అంతా కాసిం రిజివి వారసులు అంటూ మండపడ్డారు. పెద్ద సినిమాలు.. థియేటర్ ల దోపిడీపై.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సినిమా టికెట్ల ధర పెంచడం కాదని అన్నారు. సినిమా హాల్లో స్నాక్స్ రేట్లు పెంచి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. మాశాఖ అధికారులకు థియేటర్ కి వెళ్లి టికెట్.. స్నాక్స్ కొని బిల్లులు తెమ్మని చెప్పామని అన్నారు. ఆ బిల్లులు రాగానే వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. బడ్జెట్ పెంచుకుని సినిమాలు తీసి.. రేట్లు పెంచండి అంటే ఎలా? అని ప్రశ్నించారు. చిన్న సినిమాలు తీసిన వారికి కనీసం థియేటర్లు దొరకడం లేదని అన్నారు. పెద్ద సినిమాలు.. థియేటర్ ల దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
K. Keshava Rao: సీఎం రేవంత్‌ రెడ్డి తో ముగిసిన కేకే భేటీ..

Exit mobile version