Site icon NTV Telugu

Kishan Reddy: మోడీని విమర్శించండి కానీ ప్రాజెక్టులను అడ్డుకోకండి.. కేసీఆర్‌కు విజ్ఞప్తి

Kishan Reddy To Kcr

Kishan Reddy To Kcr

Kishan Reddy Wrote Letters To CM KCR About Few Projects In Telangana: మీ స్వార్థం కోసం ప్రధాని మోడీని విమర్శించండి కానీ, తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్టులను మాత్రం అడ్డుకోకండని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యక్తిగా ఫాక్స్‌కాన్ సంస్థ రాష్ట్రానికి రావాలని కోరుకుంటానని, అలాగే కేంద్రమంత్రిగా విదేశీ పెట్టుబడులు దేశానికి రావాలని కోరుకుంటానని అన్నారు. మెడికల్ కాలేజీలకు దరఖాస్తు పెట్టుకోమని చెప్పినప్పుడు పెట్టుకోలేదని.. ఇప్పుడేమో కాలేజీలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఏమైనా మాట్లాడితే.. కేసీఆర్ కుటుంబం మొత్తం తన మీద పడతారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో దళిత విద్యార్థుల అకౌంట్‌లలో డబ్బులు జమ అయ్యాయని.. కానీ తెలంగాణలోని దళిత విద్యార్థులకు డబ్బులు రాకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. అక్రమాలు చేసే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే.. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ ప్రభుత్వంపై ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.

Ponnala Lakshmaiah: కేసీఆర్ సర్కార్ మాటలతో పబ్బం గడుపుతోంది

ఇదే సమయంలో కొన్ని ప్రాజెక్ట్‌ల విషయంలో కేసీఆర్‌కు కిషన్ రెడ్డి మరోసారి లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్రంలో టెక్నాలజీ సెంటర్‌లు, ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయించాలని ఆ లేఖల్లో కోరారు. రామగుండంలో వంద పడకల ESI హాస్పిటల్‌కు భూమి ఇవ్వాలని, ప్రస్తుతం కేటాయించిన భూమి అనువుగా లేదని పేర్కొన్నారు. అనంతగిరిలో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం కోసం సహకారం అందించాలన్నారు. రైల్వేల పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలన్నారు. పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌లు కేటాయించిన భూమిలోకి ప్రవేశ మార్గం గురించి లేఖ రాశారు. అలాగే.. చర్లపల్లి, నాగులపల్లి రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి కోసం భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సైన్స్ సిటీకి అవసరమైన భూమి ఇవ్వాలన్నారు. సైనిక్ స్కూల్ ఏర్పాటు గురించి అడిగిన ఆయన.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా దాకా ఓల్డ్ సిటీ మెట్రో పనుల్ని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒప్పందం, అలాగే ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగించడంపై కేసీఆర్‌కు లేఖలు రాశారు.

Explosion: ఢాకాలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు

Exit mobile version