NTV Telugu Site icon

Kishan Reddy: తెలంగాణ రైతు పేరుతో కిషన్ రెడ్డి రైతు దీక్ష..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: హిమాయత్ నగర్ డివిజన్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించారు. హిమాయత్ నగర్ CDR హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమైంది. డోర్ టూ డోర్ ప్రచారం కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నామని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టోను ఓటర్లకు వివరిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీ లను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ గ్యారంటీ లను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో బీజేపీ దీక్షను చేపట్టిందని తెలిపారు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. వరికి 500 రూపాయల బోనస్ చెల్లించాలన్నారు. రైతు భరోసా 15 వేలు ఇవ్వాలని కోరారు. రైతు కూలీల అకౌంట్ లో 12 వేలు వెంటనే వేయాలన్నారు. ఎకరానికి 25 వేల పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Read also: Rajasthan: ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. ఏడుగురు సజీవదహనం

నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ ప్రచారం స్టార్ట్ చేశామన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికిలో వేసినట్టే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు లీడర్ లేడు.. వాళ్ల కూటమికి టెంట్ లేదన్నారు. తెలంగాణలో డబల్ డిజిట్ సీట్లు గెలుస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వచ్చిన సచ్చిన పోయేదేం లేదన్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించాం.. ప్రచారాన్ని స్టార్ట్ చేశామన్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన మోడీ నినాదాలే అన్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్లు గెలుస్తుందని తెలిపారు. కాగా.. ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అస్సాంకి వెళ్లనున్నారు.
Nagarjuna: కొత్త దర్శకులతో నాగార్జున!