Kishan Reddy: బయట మెడికల్ లో రూ.200 విలువ చేసే “ఐసోసర్బైడ్” మందులను కేవలం 21 రూపాయలకు కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా డబ్బులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెల్లించారు. పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు వైద్యం, ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధాన మంత్రి భారతీయ జనఔషధీ పథకం లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక సేల్స్ చేసిన వారికి అవార్డ్స్ లను కిషన్ రెడ్డి అందజేసారు. 2017లో 3 వేల జనఔషధీ కేంద్రాలు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 9,177కు చేరిందన్నారు. జన ఔషధి.. ‘సేవా భీ, రోజ్‌గార్ భీ’ నినాదంతో కేంద్రం ముందుకెళ్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.
Read also: Minister KTR: మళ్లీ అధికారంలోకి వస్తాం.. దానికి నిదర్శనం మీ స్పందనే
జన ఔషధి కేంద్రాల ద్వారా ఉపాధి కల్పన జరుగుతోందని అన్నారు. జన ఔషధి సుగమ్ మొబైల్ యాప్ ద్వారా కేంద్రాలు, మందుల రేట్లు తెలుసుకోవచ్చన్నారు. మెడికల్ షాపుల్లో దొరికే రేట్ల కంటే జనఔషధి కేంద్రాల్లో మందులపై 50 నుంచి 90% తక్కువ ధరకే మందులు లభిస్తాయని తెలిపారు. కరోనా సమయంలో జన ఔషధి కేంద్రాలు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. జన ఔషధి కేంద్రాల నిర్వాహకులకు ప్రోత్సాహకం రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు కేంద్రం పెంచిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జనరిక్ మెడికల్ షాపుల్లో 1700 మెడిసిన్స్ ఇస్తున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు. బయట మెడికల్ లో రూ.200 విలువ చేసే “ఐసోసర్బైడ్” మందులను కేవలం 21 రూపాయలకు కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డబ్బులు చెల్లించారు.
KTR: రేపు తొర్రూరుకు కేటీఆర్.. 20 వేల మంది మహిళలతో భారీ బహిరంగ సభ