NTV Telugu Site icon

Tummala Nageswara Rao: రైతు రుణ మాఫీ పై యాప్ పని ప్రారంభించింది..

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao: రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని రైతుల రుణమాఫీ అందరికీ వర్తింప చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వామపక్షాలు అందరికీ రైతు రుణమాఫీ వర్తింప జేయాలని ధర్నా చేస్తుండగా అదే సందర్భంలో కలెక్టర్ కార్యాలయం నుంచి రివ్యూ చేసి బయటకు వచ్చారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరావు ని వామపక్షాలు అడ్డుకున్నారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరావు కారు దిగి వామపక్షాల వద్ద వచ్చి వారితో చర్చలు జరిపారు. తమ ప్రభుత్వం రైతు రుణమాఫీకి కట్టుబడి ఉందని తెలిపారు.

Read also: Medchal Accident: బైక్ ను ఢీ కొట్టిన కారు.. తండ్రి మృతి.. కూతురికి గాయాలు..

ఎవరు ఇప్పుడు ఆందోళనలు ధర్నాలు చేయాల్సిన సమయం సందర్భము కాదని అన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించిన యాప్ పనిచేయటం మొదలుపెట్టిందని క్లారిటీ ఇచ్చారు. అందరికీ రుణమాఫీని అందజేస్తామని తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఇంటింటికి వచ్చి రైతు అప్పులు, రుణ మాఫీ పై సర్వే జరుగుతుందన్నారు. యాప్ లో అందరి వివరాలు వుంటాయని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం తూ తూ మంత్రంగా రుణ మాఫీ చెయ్యమని తెలిపారు. పక్కాగా అర్హులైన రైతు లందరికి రుణమాఫీ జరుగుతుందని మంత్రి తెలిపారు.
Ganja Seized: పుష్ప సినిమాకు మించి స్మగ్లింగ్ కు ప్లాన్.. ఏపీకి చెందిన వ్యక్తి అరెస్ట్..

Show comments