NTV Telugu Site icon

Khammam: సత్తుపల్లిలో వన మహోత్సవ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రులు..

Khammam

Khammam

Konda Surekha: కాలుష్యం నివారణకు మొక్కలను పెంచటమే మార్గమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వన మహోత్సవ కార్యక్రమంలో కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. గతంలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి‌, చల్లని నీడను ఇచ్చే చెట్లు ఇప్పుడు కనిపించటం లేదన్నారు. భవిష్యత్తు ముందు తరాలకు మంచి జరగాలి అంటే ఇప్పుడు నుండే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అశోక చక్రవర్తి భవిష్యత్తు గురించి ఆలోచించి మొక్కలు నాటారన్నారు. అవే మొక్కలు రోడ్లకు ఇరువైపులా ఉన్నాయన్నారు. డిపార్టమెంట్ కాక ఇళ్ళలో కూడా మొక్కలు నాటే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. గతంలో పందిర్లకు తీగలు మొక్కలు ఉండేవి…ఇప్పుడు చూద్దామన్న కనిపించటం లేదన్నారు.

Read also: Real Estate: యవతిపై ఇద్దరు రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ ల అత్యాచార యత్నం..

వాడ ఊరు బాగుండాలని లక్ష్యంతో అందరు మొక్కలు నాటాలన్నారు. ప్రజలను భాగస్వామ్యం చెయటం కోసమే మొక్కలు నాటే కార్యక్రమం చెపట్టామన్నారు. ఊర్లలో కోతుల బెడద చాలా ఉందని తెలిపారు. అడవుల నుండి కోతులు ఊర్లలోకి రాకుండా ఫారెస్ట్ అధికారులు చూసుకోవాలన్నారు. అడవిలో దొరికే ఫలాలను కొతులకు అందేలా చూడాలని తెలిపారు. సత్తుపల్లి అదర్శవంతగా ఉండాలన్నారు. కాలుష్యం నివారణ చెయ్యాలన్న మొక్కలను పెంచటమే ఒకే ఒక్క మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కను నాటాటమే లక్ష్యంగా భావించి మొక్కలు నాటి లక్ష్యన్ని చెరుకోవాలని తెలిపారు. రాబోయే రోజుల్లో వృక్షాలను పెంచి,కాలుష్య నివారణ చెపడతాని కొరుకుంటున్నామన్నారు.

Read also: Virat Kohli – MS Dhoni: కోహ్లీతో పాటు నన్ను కూడా ఇంటికి పంపండి.. ధోనీ గురించి పాక్ ప్లేయర్ ఏమన్నారంటే..?

ఖమ్మం జిల్లా సత్తుపల్లి వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా అనేక స్వచ్ఛంద పనుల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే దంపతులు భాగం అవుతున్నారని తెలిపారు. మనిషి మనుగడ కలగాలి అంటే చెట్లను పెంచాలన్నారు. గతంలో పెద్దలు 100 సంవత్సరాలు బతికారు అంటే చెట్లే కారణం అన్నారు. ప్రతి నిత్యం మనిషి జీవితంలో చెట్లతో అవసరం ఉంటుందన్నారు. జ్ణానం పెంపోదించుకోవాలన్న పచ్చని చెట్ల కిందకు వెళితే ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. చెట్లను నరకటం మహపాపం అన్నారు. చెట్లను పెంచాలనే ఉద్దేశ్యంతో అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. ఒక్కొక్క వ్యక్తి ఐదు నుండి పది మొక్కలు పెంచితే వన మహోత్సవ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు.
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కేసు.. కేటీఆర్ ఆగ్రహం..