NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: నేడు ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10-30 గంటలకు చింతక్ చేరుకుని రైతువేదికలో జిల్లా అధికారులతో దళిత బంధు కార్యక్రమం అమలు తీరును సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2-30 గంటలకు ముదిగొండ మండలం కమలాపురం నుంచి పమ్మి, జిల్లెలగూడ, అయ్యగారిపల్లి, అమ్మపేట, అయ్యగారిపల్లి నుంచి బాణాపురం తండా, ఎస్సీ కాలనీ నుంచి వెంకటాద్రి చెరువు వరకు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4-30 గంటలకు పమ్మిలో విద్యుత్ ఉపకేంద్రాన్ని భట్టి ప్రారంభిస్తారు.

Read also: Venkateswara Swamy Temple : హైదరాబాద్ లో ఎవ్వరికీ తెలియని 400ఏళ్ళ స్వయంభు క్షేత్రం.. తిరుమలలాగే పూజలు

నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ కడియం కావ్య పర్యటించనున్నారు. భూపాలపల్లి నియోజకవర్గలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్నారు. గణపురం మండలంలోని గాంధీనగర్, మైలారం గ్రామాల శివారులోని గుట్టలల్లో సుమారు 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని.. భూపాలపల్లి కలెక్టరేట్ లోని ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించే జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్ లో మంత్రులు పాల్గొననున్నారు.
Godavari River: శాంతించిన గోదావరి.. నీటిమట్టం 33 అడుగులు

Show comments