NTV Telugu Site icon

Singareni Workers: నేడు సింగరేణి కార్మికుల చలో రాజ్ భవన్..

Singareni

Singareni

Singareni Workers: నేడు సింగరేణి కార్మికుల చలో రాజ్ భవన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ, వేలంపాట ఆపాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుండి చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా.. సహజ వనరులు ప్రతీ పౌరుడికి దక్కాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థలకు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు సంఘటిత పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు.

Read also: AP Crime: బిస్కెట్ల ఆశచూపి.. ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం..! ఆపై హత్య..

ఇక మరోవైపు తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బొగ్గు బావుల ప్రైవేటీకరణ ఓపెన్ టెండర్లను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓపెన్ టెండర్లలో పాల్గొనకుండా కేంద్ర ప్రభుత్వం నిలదీయాలని ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ పేరుతో అదానీ, అంబానీలకు డబ్బులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ద్వారా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని బొగ్గు గనులన్నింటినీ నేరుగా బొగ్గు ఉత్పత్తిలో 139 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్మిక సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రియాజ్ అహ్మద్, జక్కుల నారాయణ, జె.శ్రీనివాస్, సుదర్శన్, పార్వతి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Catch Viral Video: కొండ ప్రాంతాల్లో స్టన్నింగ్ క్యాచ్.. సూర్యకుమార్ క్యాచ్‌తో పోలుస్తున్న అభిమానులు!