Damodar Raja Narasimha: ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగ అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జూన్ 21 న ప్రపంచ యోగ డే కర్టెన్ రైసర్ పురస్కరించుకుని పీపుల్స్ ప్లాజా, నెక్ లెస్ రోడ్ లో యోగ డే వాక్ కార్యక్రమం ఆరోగ్య శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమం పై ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ.. యోగాను ప్రతి ఒక్కరు దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగ అన్నారు. మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప చారిత్రక సంపద యోగ అని తెలిపారు. యోగా సాధన వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుందన్నారు.
Read also: Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజ్ నీటిమట్టం..
ప్రపంచ యోగా దినోత్సవంను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా జూన్ 21న రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలో, కళాశాలలో ఘనంగా నిర్వహించాలన్నారు. యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యాలు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. ప్రపంచ యోగ దినోత్సవాన్ని జూన్ 21 ను పురస్కరించుకొని ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రాంలో ఫ్లాగ్ ఆఫ్ చేసి యోగ వాక్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ ప్రశాంతి, డైరెక్టర్ పాణికిరణ్, నేచురపతి, హోమియోపతి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
IMD warning: నేడు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక