Site icon NTV Telugu

Kishan Reddy: హుజూరాబాద్ ఫలితాలే రిపీట్ అవుతాయి.. కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: హుజూరాబాద్ ఫలితాలే రిపీట్ అవుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. BRS పోయి కాంగ్రెస్ వస్తె పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీతో 30 శాతం మంది రైతులకు కూడా లాభం జరగలేదన్నారు. ఉస్మానియా ఆస్పత్రికి తాళాలు వేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. TSPSC విఫలమైందని, 17 పరీక్షలు వాయిదా పడ్డాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు. మెడిగడ్డ బ్యారేజ్ లో ఉన్న 10 TMC ల వాటర్ ఖాళీ చేశారని అన్నారు. భద్రాచలం సీతారామ కళ్యాణనికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కనీసం వెళ్ళడం లేదన్నారు. మనుమడిని
భద్రాచలం పంపడం ఎంత వరకు కరెక్ట్ ? అని ప్రశ్నించారు. శాసన సభ ఎన్నికలు ఎటు దారి తీస్తాయో తెలియని పరిస్థితి అన్నారు. ఎన్నికల వ్యవస్థను కేసీఆర్ చిద్రం చేశారని తెలిపారు. కామారెడ్డిలో, గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోతారని తెలిపారు.

హుజూరాబాద్ ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు. దేశంలో అన్ని సమస్యలకూ మూల కారణం కాంగ్రెస్ అని మండిపడ్డారు. గ్యారెంటీలతో కర్ణాటకలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్.. ప్రజల వ్యతిరేకత మూట కట్టుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు. 88 మంది అభ్యర్థులను ప్రకటించామన్నారు. మిగతా సీట్లను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఈ రోజు రాత్రికి మిగతా సీట్లు ప్రకటిస్తామని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పొత్తు ధర్మంగా జనసేనతో కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. కాళేశ్వరం పై రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ఈ రోజు సాయంత్రం వరకు సీబీఐ విచారణకు ఆదేశించే భాద్యత నాది అన్నారు. CBI నేరుగా దర్యాప్తు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. రెండు గంటలకు సిఎం కేసీఆర్ CBI దర్యాప్తు చేయాలని సంతకం చేస్తే… నాలుగు గంటల లోపు CBI దర్యాప్తు కు ఆదేశించే బాధ్యత నాదన్నారు.
Israel Attack: పాలస్తీనియన్ల హత్యకు నిరసనగా ఇజ్రాయెల్‎లో తన రాయబారిని వెనక్కి పిలిచిన టర్కీ

Exit mobile version