Kishan Reddy: గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ తెలంగాణలో గారడీ చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేటలో బీజేపీ గావ్ చలో(పల్లెకు పోదాం) అభియాన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి డిల్లీకి, హైదరాబాద్ కు తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసి డిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని, రాహుల్ గాంధీపైన దేశ ప్రజలకు విశ్వాసం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగంలో 95శాతం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ ఎన్నికలు మోదీ కోసం కాదు దేశ భవిష్యత్తు కోసమన్నారు. పార్టీ, పార్టీ నాయకుడి కంటే దేశం, దేశ ప్రజలు మాకు ముఖ్యమన్నారు. దేశ వ్యాప్తంగా 24గంటల పాటు గ్రామాల్లో ఉండాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని, జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా సహా అందరూ గ్రామాలను సందర్శిస్తున్నారని తెలిపారు.
Read also: Team India Coach: టీమిండియా కోచ్‌గా వచ్చేందుకు ఎప్పుడూ సిద్దమే: గ్యారీ కిరిస్టెన్
రైతులు, మహిళలు, రైతు కూలీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశం అవుతున్నామన్నారు. గ్రామంలోని రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కార్యక్రమం లక్ష్యమన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో పల్లెకు పోదాం.. అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజల అభివృద్ధి, మహిళా సాధికారత, శాంతి భద్రతల కోసం దేశంలోని ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జాతీయ రహదారులతో దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వం అనుసంధానం చేసిందని తెలిపారు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 2014వరకు తెలంగాణలో 2400కిలో మీటర్లు జాతీయ రహదారి ఉండేది.. మోదీ వచ్చాక 5 వేల కిలో మీటర్లు దాటిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాను విజయపథంలో నడిపించాలని తెలిపారు. నరేంద్ర మోదీ పార్లమెంట్లో అద్భుతంగా ప్రతిపక్షాల నోరు మూపించారని కీలక వ్యాఖ్యలు చేసారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని భూ ప్రపంచంలో అవినీతి చేసిందని ఎవరూ అనలేరన్నారు. నరేంద్ర మోదీకీ ఎన్ని ఓట్లు, సీట్లు వస్తాయని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
Read also: DCP Vijay Kumar: ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసు.. దుబాయ్ లో రాహిల్, షకీల్..
ప్రతి పోలింగ్ బూత్ లో 25మందిని కొత్త వారిని చేర్పించుకోవాలని, ప్రతి ఇంటింటికీ తిరగాలి పార్టీలోకి ఆహ్వానించాలన్నారు. పోలింగ్ బూత్ కమిటీలు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ నమో యాప్ చూడాలి.. నమో యాప్ లో అన్ని అంశాలు పొందుపరిచామన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో నిత్యావసర ధరలను తగ్గించగలిగామని.. నిత్యావసర ధరలపైన ప్రతిపక్షాలు ప్రశ్నించింది లేదన్నారు. ఇతర పార్టీల్లో యాక్టివ్ గా లేని వాళ్ళను పార్టీలో చేర్చుకోవాలని తెలిపారు. కమ్యునిజం కనుమరుగైంది.. తెలంగాణ పేరు తొలగించిన రోజే కేసీఆర్ పార్టీ ఖతమైందని కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాకు కనుచూపు మేరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదన్నారు.
పోలింగ్ బూత్ లో వంద ఓట్లు పోలైతే.. 51 ఓట్లు భాజపాకు రావాలన్నారు. 70శాతం ఓట్లు తెచ్చిన బూత్ నాయకులను సన్మానిస్తామన్నారు. ముస్లిం మహిళల ఓట్లను కూడగట్టుకొని మెజార్టీ తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలను వంట ఇంటి కుందెల్లుగా, పిల్లలను కనే యంత్రాలుగా తయారు చేస్తుందన్నారు.
Minister Botsa: డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక భేటీ