NTV Telugu Site icon

CPI Narayana: అందాలు, ప్యాషన్ పోటీ పెడితే.. మోడీ కి ప్రథమ బహుమతి వస్తుంది..

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: అందాల పోటీ, ప్యాషన్ పోటీ పెడితే మోడీకి ప్రథమ బహుమతి వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య ‌రామ మందిరం నిర్మాణం పూర్తి కాకముందే ప్రారంభించారు. ఇది అగమ‌శాస్త్ర నిబంధనలకి వ్యతరేకమన్నారు. రామమందిరం అంశం ప్రజల్లోకి వెళ్ళకపోవడంతో మోడీ గ్యారంటి తెరపైకి తీసుకువచ్చారన్నారు. మంగళసూత్రం ఉపయోగించి ‌ఓట్లని రాబట్టుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఇండియా‌కూటమి గెలిస్తే ముస్లిం‌‌ రిజర్వేషన్ తీసుకువస్తున్నారని ప్రచారమన్నారు. మోడీ కట్టిన‌ మంగళసూత్రానికే విలువలేకుండా పోయిందన్నారు. మోడీ పదేండ్లలలో‌ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, స్విస్ బ్యాంకు ‌తీసుకువచ్చిన‌ నల్లధనం‌ ఎంత? అని ప్రశ్నించారు. గుజరాత్, మోడీ ఇంటిపేరు గల వ్యక్తులే డబ్బులు ఎత్తుకెళ్ళిపొయారని కీలక వ్యాఖ్యలు చేశారు. వీరంతా మోడీ దత్త పుత్రులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ వచ్చిన తరువాత డబ్బులు తిన్నవారు‌ ఒకరూ జైలుకి వెళ్ళలేదన్నారు.

Read also: DK Aruna: లక్కీ డిప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలింది..

ఆదాని‌ గుజరాత్ లో‌ ఒక‌ గంజాయి‌ స్మగ్లర్.ఆదాని ఆస్తులు‌ పెరగడానికి కారణం మోడినే అన్నారు. మోడీ ‌వచ్చాక నల్లధనం‌ వైట్ మనీ అయ్యిందన్నారు. అందాల పోటీ, ప్యాషన్ పోటీ పెడితే మోడీకి ప్రథమ బహుమతి వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ని‌ జైలుకి పంపాలని చూసారు.ప్రశ్నించే వారిని అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ని అరెస్టు చేస్తే చెట్టంత‌ ఎదుగుతాడన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికే నాలుగు వందల సీట్లు‌ గెలవాలని చూస్తున్నాడని తెలిపారు. అనుకూలంగా ఉన్నవారిని గెలిపించడానికి ఈసిని‌‌ కూడ మోడీ వాడుకుంటున్నాడని అంటున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఫైట్ నడుస్తుందన్నారు. కేసీఆర్ అహంకారం, అహంభావం కారణంగా బీఆర్ఎస్ ‌ఖతం అయ్యిందన్నారు. కేసీఆర్ తెలంగాణలో గెలిచే దిక్కు లేదు‌ కాని.. హంగ్ వస్తది, మేము కీలకం అని‌ మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన ‌చట్టంలోని‌ ఒక్క హామీలు‌ బీజేపీ అమలు చేయలేదన్నారు. తెలంగాణకి బద్ధ శత్రువు బీజేపీ అన్నారు.
Mallu Bhatti Vikramarka: కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్లకు శంఖుస్థాపనలు చేస్తాం..

Show comments