Bandi Sanjay: నక్సలైటులే దేశ భక్తులు అని కొంత మంది అర్బన్ నక్సలైట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నక్సలైటు లు ఏ దేశానికి భక్తులు?.. నక్సలిజాన్ని అంత మొందించడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం.. నక్సలిజం ఇప్పటి వరకి సాధించినది శూన్యం.. ఛత్తీస్‌గఢ్ లో పేదరిక నిర్మూలన జరిగిందా.. జాతీయ పతాకాన్ని ఎగుర వేసే పరిస్థితి లేదు.. నక్సలైట్లు తుపాకీ గొట్టం ద్వారా సాధించినది ఏమిటి? అని క్వశ్చన్ చేశారు. భద్రతా, అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.
Read Also: Khazana jewellery robbery: 100 కోట్ల బంగారం టార్గెట్.. బీహార్ గ్యాంగ్ ప్లాన్
అయితే, భారతదేశంలో నక్సలిజం నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యింది అని కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ నక్సల్స్ తో చర్చలు జరుపాలని కోరారు.. అపరేషన్ కాగార్ ఆపాలని కోరారు.. రేవంత్ రెడ్డికి నక్సలిజంపై ద్వంద విధానం ఉంది.. రాష్జ్త్రంలో నక్సలైట్స్ పై నిషేధం విధించారు.. కేంద్రం మాత్రం చర్చలు జరపాలని అంటారు అని ఎద్దేవా చేశారు.
